Begin typing your search above and press return to search.

లేజీ డాన్స‌ర్ లుంగీ డాన్స్ ఎలా చేస్తాడో?

By:  Tupaki Desk   |   4 Dec 2022 2:30 AM GMT
లేజీ డాన్స‌ర్ లుంగీ డాన్స్ ఎలా చేస్తాడో?
X
బాలీవుడ్ లో లేజీ డాన్స‌ర్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే ఠ‌క్కున స‌ల్మాన్ ఖాన్ పేరు గుర్తొస్తుంది. బాడీని ఎంత ఫిట్ గా ఉంచినా డాన్సులు చేయాల్సి వ‌చ్చే స‌రికి సల్మాన్ చాలా ఇబ్బంది ప‌డిపోతుంటాడు. అత‌నితో స్టెప్పులు వేయించ‌డానికి కొరియోగ్రాఫ‌ర్లు నానా తంటాలు ప‌డుతుంటాడు. షారుక్ ఖాన్ లా..అమీర ఖాన్ లా...హృతిక్ రోష‌న్ లా శ‌రీరాన్ని అంత ఈజీగా క‌ద‌ప‌లేరు.

సిక్స్ ప్యాక్ బాడీ అయినా ఆ ఎన‌ర్జీ డాన్సుల్లో మిస్ అవుతుంటుంది. ఈనేప‌థ్యంలో స‌ల్మాన్ ఖాన్ భారీ సాహ‌సానికే పూనుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న క‌థానాయ‌కుడిగా 'కిసీకా భాయ్..కిసీ కా జాన్' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యింది.

ఇటీవ‌లే సల్మాన్ పై చిత్రీక‌రించిన పాట సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఈ పాట‌లో స‌ల్మాన్ లుంగీ డాన్స్ తో అల‌రిస్తార‌ని స‌మాచారం. అయితే ఈ లుంగీ డాన్స్ స‌ల్మాన్ ఎలా చేసాడ‌న్న‌దే? ఆస‌క్తిక‌రం. సాధార‌ణ డాన్సులు చేయ‌డ‌మే భాయ్ కి క‌ష్ట‌మైన ప‌ని. అలాంటింది లుంగీలో సిగ్నేచ‌ర్ స్టెప్పులు వేయ‌డం అంటే ఆయ‌న పెద్ద సాహ‌సం చేసిన‌ట్లే భావించాలి.

మ‌రి భాయ్ లుంగీ డాన్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది రిలీజ్ త‌ర్వాత తేల్తుంది. ఇలాంటి లుంగీ డాన్సుల్లో ఇర‌గ‌దీయ‌డం మాత్రం బాలీవుడ్ లో షారుక్ ఖాన్కి ..టాలీవుడ్ లో చిరంజీవికి మాత్ర‌మే చెల్లింది. ఆ ఇద్ద‌రు లుంగీ క‌ట్టి బ‌రిలోకి దిగారంటే మాస్ ఆడియ‌న్స్ లో పూన‌కాలు త‌న్నుకొచ్చేస్తాయి. 'చెన్నై ఎక్స్ ప్రెస్' ని ఒక్క లుంగీ డాన్స్ తోనే షారుక్ ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసారు.

లుంగీ డాన్సు కోసమే రిపీటెడ్ ఆడియ‌న్స్ ఉన్నారు. ఇక చిరంజీవి మాస్ లుంగీ డాన్స్ అంత‌కు మించి హైలైట్. ఆయ‌న ఇప్ప‌టికే చాలా సినిమాల్లో ఆ త‌రహా స్టెప్పుల‌తో అల‌రించారు. మ‌రి భాయ్ బ‌ద్ద‌కాన్ని వ‌దిలేసి ఆ లెగ‌స్సీని అందుకునేలా పెర్పార్మెన్స్ ఇస్తాడా? అన్న‌ది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.