Begin typing your search above and press return to search.

పోకిరి దూకుడు అంత మాస్ ట్రీట్ ఉంటుందా?

By:  Tupaki Desk   |   19 April 2021 2:30 AM GMT
పోకిరి దూకుడు అంత మాస్ ట్రీట్ ఉంటుందా?
X
చూడటానికి మ‌హేష్ ఎంత క్లాస్ గా ఉంటాడో అత‌డి మ్యాన‌రిజంలో అంత‌కుమించిన మాస్ ఉంటుంది. అత‌డు మాట్లాడే తీరు పంచ్ లు వేసే శైలి ప్ర‌తిదీ మాసీగా ఉంటుంది. అది పోకరి నుంచి దూకుడు వ‌ర‌కూ పెద్ద‌గానే వ‌ర్క‌వుటైంది. బిజినెస్ మేన్ చిత్రంలోనూ మ‌హేష్ లోని మాస్ స్ట్రైకింగ్ న‌ట‌న అంద‌రికీ న‌చ్చింది. ఇక భ‌ర‌త్ అనే నేను- శ్రీ‌మంతుడులో ఎంత క్లాస్ గా క‌నిపించాడో తెలిసిన‌దే. అందుకు భిన్నంగా మ‌హ‌ర్షిలో క‌నిపించారు మ‌హేష్‌.

అందుకే ఇప్పుడు స‌ర్కార్ వారి పాట‌లో ఎలా క‌నిపిస్తారు? అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. ఇక ఈ సినిమాని ప‌ర‌శురామ్ పెట్లు ఓ రేంజులో తెర‌కెక్కిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ ని మాస్ అండ్ క్లాస్ పాత్ర‌ల్లో ఎంతో ఎన‌ర్జిటిక్ గా చూపిస్తున్నార‌ట‌. చెవికి పోగు మెడలో దండతో మాసీగా కనిపిస్తూనే మరో వైపు క్లాస్ గానూ క‌నిపిస్తార‌ని ఇప్ప‌టికే లీకైన ఫోటోలు చెబుతున్నాయి. పోకిరి దూకుడు అంత మాస్ ట్రీట్ ఉంటుందా? అంటే ప‌ర‌శురామ్ మార్క్ తో ఉండొచ్చ‌ని అంచ‌నా.

ఇంత‌కుముందు పోస్ట‌ర్ తోనే మాస్ కంటెంట్ పుష్క‌లంగా ఉన్న సినిమా ఇద‌ని అర్థ‌మైంది. ఇక క‌థానాయిక‌లతో మాస్ సాంగ్స్ లోనూ మ‌హేష్ క‌నిపిస్తార‌ట‌. ఇందులో కీర్తి సురేష్ నాయిక‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ - 14 రీల్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దుబాయ్ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే మ‌హ‌మ్మారీ వ‌ల్ల వాయిదా ప‌డింది. చిత్ర‌బృందంలో ప‌లువురికి క‌రోనా సోకింద‌ని క‌థ‌నాలొచ్చాయి.