Begin typing your search above and press return to search.

క‌నీస మెయింటెనెన్స్ కి లేక న‌టీమ‌ణులకు ఎంత క‌ష్టం?

By:  Tupaki Desk   |   4 May 2021 2:30 PM GMT
క‌నీస మెయింటెనెన్స్ కి లేక న‌టీమ‌ణులకు ఎంత క‌ష్టం?
X
అంతా బావుంటేనే ఏదైనా.. మ‌మ‌హ్మారీ సీన్ అంతా అయోమ‌యంగా మార్చింది. మ‌న క‌థానాయిక‌ల‌ ర‌క‌ర‌కాల ఆదాయ మార్గాల్ని మూసేసింది నేటి అత్య‌యిక‌ ప‌రిస్థితి. కేవ‌లం ఒక గంట‌లో ల‌క్ష‌ల్లో సంపాదించే సత్తా ఎంద‌రికో ఉన్నా.. ఇప్పుడు ఆర్థికంగా స్ట్ర‌గుల్స్ త‌ప్ప‌డం లేదు. స్టార్ హీరోయిన్లు.. న‌వ‌త‌రం నాయిక‌లు .. సెకండ్ గ్రేడ్ న‌టీమ‌ణుల‌కు రిబ్బ‌ను క‌టింగుల ద్వారా బోలెడంత ఆదాయం వ‌చ్చేది.

షాపింగ్ మాల్స్ ప్రారంభోత్స‌వాలు.. ఫ్రాంఛైజీ వ్యాపారాల లాంచింగుల‌తోనే బోలెడంత ఆదాయం ద‌క్కేది. కానీ ఇటీవ‌లి కాలంలో మాల్స్ ప్రారంభోత్స‌వాలేవీ లేవు. అగ్ర నటీమణులకు సైతం ఎండార్స్ మెంట్ లు డిజిటల్ ప్రమోషన్ల ద్వారా ఆదాయం ప‌డిపోయింద‌నేది ఒక స‌ర్వే.

స‌ద‌రు భామ‌ల‌ స్టార్ డమ్ స‌క్సెస్ రేటును బట్టి 10-20 లక్షల ఆదాయం చాలా సులువుగా ద‌క్కేది. ప్రారంభోత్సవం మొత్తం ప్రక్రియ ఒక గంటలో పూర్తవుతుంది. నెల‌కు నాలుగైదు ఇటువంటి ప్రారంభోత్సవాలతో టాప్ హీరోయిన్స్ ఎప్పుడూ బిజీగా ఉండేవారు. కానీ కరోనావైరస్ రంగ ప్ర‌వేశంతో నటీమణులకు ఈ అదనపు ఆదాయ మార్గం లేకుండా పోయింది. అన్ని వైపులా త‌లుపులు మూసేసారు. భారీ చెల్లింపులు చేయ‌లేక‌ ప్రారంభోత్సవాలను దాటవేయాలని మాల్స్ నిర్ణయించుకున్నాయి. అయితే కేవ‌లం ఇలాంటి ఆదాయం కోస‌మే ఎదురు చూసే న‌టీమ‌ణుల‌కు దీంతో తీవ్ర‌మైన పంచ్ ప‌డిపోతోంది. చేతిలో సినిమాలు లేని చిన్న నటీమణులు చాలా మంది తీవ్రంగా పోరాడుతున్నారు.

ప‌లువురు కొన్ని బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రోత్సహించడానికి డిజిటల్ ప్రమోషన్లపై ఆధారపడినా.. ఇటీవ‌ల వాటి ద్వారా వచ్చే ఆదాయాలు కూడా ఇప్పుడు తగ్గాయి. ఈ సెకండ్ వేవ్ దెబ్బ‌కు న‌వ‌త‌రం అప్ క‌మింగ్ స్టార్లు కూడా ఎంతో ఇబ్బంది ప‌డుతున్నారు. స్టార్ హీరోయిన్లు ఇప్ప‌టికే ఆర్జించుకుని సేఫ్ గేమ్ లో ఉంటారు కాబ‌ట్టి ఇలాంటి వాటి గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ న‌వ‌త‌రం క‌నీస మెయింటెనెన్స్ కి అయినా లేక నానా తంటాటు ప‌డాల్సిన స‌న్నివేశం ఎదుర‌వుతోంది. ఇంత‌కుముందులా జల్సాల‌కు ల‌గ్జ‌రీ లైఫ్ కి పంచ్ ప‌డిపోయిన‌ట్టే.