ఫోటో స్టోరి: వీళ్ల ముఖాలకు ఏమైంది?

Wed Oct 09 2019 17:51:37 GMT+0530 (IST)

Housefull 4 Movie Team Gives Different Face Expression

బాలీవుడ్ లో `హౌస్ ఫుల్ 4` ప్రస్తుతం హాట్ టాపిక్. దీపావళి కానుకగా ఈ భారీ మల్టీస్టారర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రకరకాల పోస్టర్లు రిలీజై సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇంతకుముందు హౌస్ ఫుల్ 4 (హెచ్.ఎఫ్- 4) చిత్రంలో పూజా హెగ్డే లుక్ సహా కాస్టింగ్ మొత్తం గెటప్ లు ఎలా ఉంటాయో పోస్టర్లను రివీల్ చేశారు.ఆసక్తికరంగా పునర్జన్మల నేపథ్యంలో కన్ఫ్యూజన్ కామెడీతో ఏదో  కొత్తగా దర్శకుడు ఫర్హాద్ సామ్జీ డిజైన్ చేశారని అర్థమవుతోంది. పునర్జన్మల నేపథ్యం అందులోనే కన్ఫ్యూజన్ నుంచి పుట్టుకొచ్చే కామెడీ హైలైట్ గా ఉంటుందట. అంటే ప్రతి పాత్రధారి రెండు కాలాల్లో కనిపిస్తారు. ప్రెజెంట్ కి కనెక్టివిటీ ఉంటుంది. అందుకు తగ్గట్టే గెటప్పులు మారుతుంటాయి. 1419లో .. 2019లో కథ సాగుతుంది. ఆ రెండు కాలాలకు  కనెక్టివిటీ ఉంటుంది. ఈ చిత్రంలో కిలాడీ అక్షయ్ కుమార్ గుండు బాస్ గెటప్ లోనూ కనిపిస్తున్నారు. కృతి సనోన్- కృతి కర్భంద- పూజా హెగ్డే లాంటి అందగత్తెలు అభిమానులకు ట్రీటివ్వబోతున్నారు.  తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ కొత్త పోస్టర్ ని సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో అందరు స్టార్లతో పాటుగా బాబి డియోల్ కనిపిస్తున్నారు. అక్షయ్ - రితేష్ సహా కథానాయికలు రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే బాబి డియోల్ మాత్రం ఏదో చూస్తూ నిలబడ్డారు.

దీనికి అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అసలు కెమెరాకి ఎలా ఫోజివ్వాలో కూడా తెలీదు. బాబి డియోల్ నటన మర్చిపోవాలి! అని కామెంట్లు రువ్వారు. ఆ కాలం బందిపోటులా కనిపిస్తున్నా ముఖంలో ఎక్స్ ప్రెషన్ లేదు. ఇక మిగతా వాళ్లందరి ముఖాల ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే నవ్వకుండా ఉండలేం. అసలు వీళ్లకేమైంది అన్నట్టే కనిపిస్తోంది ఆ ఎక్స్ ప్రెషన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.