కాఫీ విత్ కరణ్ 7 ట్రైలర్: సారా- జాన్వీ -సమంత ఎవరు హాట్?

Sat Jul 02 2022 21:00:01 GMT+0530 (IST)

Hotstar Specials Koffee With Karan Season 7 Starts July 7

మోస్ట్ అవైటెడ్ `కాఫీ విత్ కరణ్ 7` ట్రైలర్ విడుదలైంది. మొదటి ఆరు సీజన్లు బుల్లితెర వేదికగా అలరించగా ఈసారి సీజన్ 7 ఓటీటీలో సందడి చేయనుంది. కరణ్ తో కాఫీని ఈసారి తారలు ఓటీటీ కోసం తాగుతున్నారు. కరణ్ తో కలిసి ఏ సెలబ్రిటీ ఈసారి ఇంటర్వ్యూల్లో కనిపిస్తారు? అన్నది ఇప్పటికే ఉత్కంఠను పెంచింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ లో కొందరు స్టార్లను కూడా రివీల్ చేయడంతో ఫ్యాన్స్ లో కిక్కు పెరిగింది.ఈసారి సీజన్ లో అందాల సమంత ప్రత్యేక ఆకర్షణ కానుంది. సామ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి కరణ్ షోలో సందడి చేయనుండగా.. అనన్య పాండే - విజయ్ దేవరకొండ జోడీ.. సారా అలీఖాన్ - జాన్వీ కపూర్ జోడీ కాఫీ విత్ కరణ్ లో సందడి చేస్తున్నారు. అలాగే రణవీర్ సింగ్ .. టైగర్ ష్రాఫ్.. అనీల్ కపూర్.. వరుణ్ ధావన్ సహా పలువురు టాప్ స్టార్లు కాఫీ విత్ కరణ్ లో కనిపించనుండడం ఆసక్తిని పెంచుతోంది. తాజా ట్రైలర్ లో భామల సందడి అంతా ఇంతా కాదు.

కాఫీ విత్ కరణ్ సీజన్ 7 మొదటి ట్రైలర్ షో ఎంత రంజుగా సాగనుందో ఆవిష్కరించిందని చెప్పాలి. కరణ్ తో కలిసి తారలు బోలెడంత ఫన్ ని పండిస్తుండగా.. షో ఆద్యంతం జోకులు పంచ్ లతో ఆకర్షిస్తోంది. ఇక షోకి విచ్చేసిన తారల్లో కాస్ట్యూమ్స్ పరంగా ఎవరికి వారు యూనిక్ గానూ కనిపిస్తున్నారు. షోలో యథావిధిగా రణవీర్ సింగ్ .. కరణ్ జోహార్ ఎంతో ప్రత్యేకంగా కనిపించనున్నారు.

ట్రయిలర్ లో తన సెక్స్ ప్లేలిస్ట్ గురించి రణవీర్ గొప్పగా చెప్పుకోగా.. కొన్ని క్రేజీ డ్యాన్స్ మూవ్ లతో అనీల్ కపూర్ కనిపించారు. ప్రజలు ఫిల్లర్లు పొందడాన్ని తాను ఆమోదించనని అక్షయ్ కుమార్ చెబుతున్నాడు. అయితే అతడు ఫిల్టర్ లు అని చెప్పాలనుకుంటున్నట్లు ఇంతలోనే అర్థమవుతుంది. అలాగే తన మాజీ అందరికీ మాజీ! అంటూ సారా అలీఖాన్ జోక్ చేయడం ఆకట్టుకుంది.  

ఇంతకీ సారా మాట్లాడేది కార్తిక్ ఆర్యన్ గురించేనా? అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. జూలై 7 నుండి డిస్నీ+ హాట్ స్టార్ లో కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ప్రత్యేకంగా ప్రదర్శితమవుతుంది. చాట్ షో టెలివిజన్ లో ప్రసారం కాదు. OTT వేదికపై ప్రసారం కావడం ఇదే మొదటిసారి. 2004లో స్టార్ వరల్డ్ లో తొలిసారిగా ప్రసారమైన `కాఫీ విత్ కరణ్` పెద్ద సక్సెసైంది. ఈ షోలో బాలీవుడ్ ప్రముఖులు తమ కెరీర్ గురించి రిలేషన్ షిప్స్ .. వ్యక్తిగత శత్రుత్వం వంటి వాటిపై ఫిల్టర్ లెస్ గా ఓపెన్ గా మాట్లాడారు. దీంతో షో పెద్ద సక్సెసైంది. ఇప్పుడు సీజన్ 7 ఓటీటీకి షిఫ్టయింది.

కొత్త సీజన్ లో రణవీర్ సింగ్ తో అలియా భట్.. సమంతా రూత్ ప్రభుతో అక్షయ్ కుమార్.. వరుణ్ ధావన్ తో అనిల్ కపూర్.. విజయ్ దేవరకొండతో అనన్య పాండే.. సారా అలీ ఖాన్ తో జాన్వీ కపూర్.. కృతితో టైగర్ ష్రాఫ్ ఉన్నారు. కియారా అద్వానీతో షాహిద్ కపూర్ కనిపించనున్నారు.

ఇక ఈ షోలో ఇతర భామల కంటే సమంత ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెడ్ హాట్ లెదర్ డ్రెస్ లో సామ్ అందాల ఎలివేషన్ అగ్గి రాజేసిందని చెప్పాలి. తనతో పాటే కనిపిస్తున్న  అనన్య పాండే - సారా - జాన్వీ కపూర్ సామ్ ముందు తేలిపోయారని చెప్పాలి. లుక్స్ పరంగా సామ్ అంత జాగ్రత్త తీసుకుంది. ఇక సమంత వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలకు కరణ్ కి జవాబులిచ్చింది సామ్. ప్రస్తుతం ఈ ట్రైలర్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.