Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్.. ఫ్యాన్స్ కి మంట పుట్టిస్తుందా... ?

By:  Tupaki Desk   |   28 Nov 2021 12:30 PM GMT
ట్రిపుల్ ఆర్.. ఫ్యాన్స్ కి మంట పుట్టిస్తుందా... ?
X
ట్రిపుల్ ఆర్ కి కౌంట్ డౌన్ మొదలైంది. జనవరి 7న గ్రాండియర్ గా వరల్డ్ లెవెల్ లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. బహు భాషల్లో ఒకే రోజున వస్తున్న ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమన్న అభిప్రాయం అంతటా ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రెండు నెలలుగా టీమ్ చేస్తున్న ప్రయత్నాలు పెడుతున్న ఎఫర్ట్స్ నిజంగా ఆహా అన్న రేంజిలో ఉన్నాయి. ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక త్వరలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కూడా ప్రమోషన్స్ లో జాయిన్ అవుతారు అంటున్నారు. నేషనల్ మీడియాను కూడా కవర్ చేస్తూ ట్రిపుల్ ఆర్ జోరు పెంచేస్తారు అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ రన్ టైమ్ అచ్చంగా మూడు గంటల ఆరు నిముషాలుగా వచ్చింది. అంటే ఒక విధంగా పెద్ద సినిమా కింద లెక్క. జనవరిలో రిలీజ్ అంటే వింటర్ సీజన్ లో మాట్నీకి వెళ్తే చీకటి పడుతూ థియేటర్ల నుంచి బయటకు జనాలు వస్తారన్న మాట. మరి ఈ రన్ టైమ్ మంచిందే మూవీకి హెల్ప్ అవుతుందా అంటే ష్యూర్ అంటున్నారు సినీ పండితులు. సినిమా బాగుండాలే కానీ రన్ టైమ్ లెక్కే కాదని అంటున్నారు. సో అది పెద్ద ప్రాబ్లమే కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇక సినిమాలో ఒక విషయం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంత పెద్ద సినిమా తీశారు. ఇందులో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇకరు నందమూరి వారసుడు అయితే మరొకరు కొణిదెల సింగం. మరి ఈ ఇద్దరికీ స్క్రీన్ షేర్ ఎలా చేశారు, ఇద్దరి పాత్రల నిడివి ఎంత ఉంటుంది అన్నదే ఫ్యాన్స్ మధ్య హాట్ హాట్ డిస్క్షన్ గా ఉందిట. అయితే ప్రచారం లో ఉన్న మాట ఏంటి అంటే కాస్తా ఎక్కువగా చరణ్ పాత్రనే స్క్రీన్ షేర్ ఉంటుందట.

చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రను కారీ చేస్తూ మరో పాత్ర కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీయార్ ది ఉంటుంది. అంటే లాజిక్ గా చెప్పుకున్నా చరణ్ పాత్రకు కొంత ఎక్కువ షేర్ ఉండే చాన్స్ కనిపిస్తోందిట. దాని మీద పూర్తి వివరాలు సినిమా రిలీజ్ అయితే కానీ తెలియవు. అయితే ప్రచారంలో ఉన్నదే నిజమైతే జూనియర్ కి కొంత పాత్ర నిడివి తక్కువ పడితే ఫ్యాన్స్ మధ్యన అది మంటలు పుట్టించే వ్య‌వహారమే అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. అయితే సినిమాను అందులోని పాత్రలను అలాగే చూడాలని, విప్లవ వీరుల ఇంపార్టెన్స్ అన్నది ఇక్కడ ప్రధానం తప్ప హీరోలు కానే కాదన్న వాదన కూడా ఉంది. మొత్తానికి ఇవన్నీ కూడా ట్రిపుల్ ఆర్ మీద అంచనాలను ఇంకా పెంచేస్తున్నాయనే చెప్పాలి.