హాట్ యాంకర్ సీక్రెట్ మ్యారేజ్ ట్విస్ట్?

Sun Jan 23 2022 11:19:39 GMT+0530 (IST)

Hot Anchor Secret Marriage Twist

సదరు యాంకర్ బుల్లితెరపై కనిపిస్తే వేలాది హృదయాలు బరువెక్కిపోతాయి. తనదైన అందం కవ్వింతతో టీజ్ చేస్తూ కుర్రకారు కంటికి కంటికి కునుకు కరువయ్యేలా చేస్తోంది ఈ యాంకరమ్మ. బుల్లితెరపై ఎందరు యాంకర్లు ఉన్నా కానీ దశాబ్ధ కాలంగా తన గ్లామర్ షో ముందు ఎవరైనా దిగదుడుపేనని ప్రూవ్ చేసింది.అయితే సదరు యాంకరమ్మకు 30 ప్లస్ అవ్వడంతో రహస్యంగా పెళ్లి చేసుకుంది! అంటూ తాజాగా ఓ గాసిప్ షికార్ చేస్తోంది. తెలుగు టెలివిజన్ లో హాట్ యాంకర్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటుంది.  నటిగా యాంకర్ గా తనకు నేము ఫేము ఉంది. అయితే తాను రహస్యంగా పెళ్లి చేసుకుందని గుసగుస వైరల్ అవుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ఆమెకు కొంతకాలం క్రితం ఒక వ్యక్తితో వివాహం జరిగింది.

 ఆయనకు సినిమా పరిశ్రమకు సంబంధం లేదు. అయితే అనూహ్యంగా ఈ కొత్త ప్రచారం తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెళ్లయింది అనేందుకు ఎలాంటి సూచన లేదు. ఆమె తన రెగ్యులర్ స్టైల్ లో తన ఫోటోషూట్ లను పోస్ట్ చేస్తోంది. అయితే ఈ గుసగుస ఎలా బయటకు వచ్చింది? ఎవరు హింట్ ఇచ్చారు? అంటే తాను పని చేసే చోటి నుంచే లీకైందని తెలుస్తోంది.

ఈ రూమర్లపై సదరు యాంకరమ్మ అస్సలు స్పందించనేలేదు. ఇప్పటికీ ఈ అమ్మడు కో- మేల్ యాంకర్ తో ప్రేమలో ఉందని తన అభిమానులు భావిస్తున్నారు. అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితమే ఆ రూమర్ లను కొట్టిపారేశారు. ప్రేమ వ్యవహారం కేవలం టీవీ ప్రోగ్రామ్ ని రక్తి కట్టించేందుకే. కేవలం ప్రేక్షకుల్లో జోడి గురించి ఆసక్తిని పెంచేందుకు ఆడే డ్రామా అని తెలిపారు.

 ఇక సదరు 30 ప్లస్ యాంకరమ్మ త్వరలోనే పరిశ్రమ మెగా హీరో సినిమాలో అదిరిపోయే ఐటమ్ తో ట్రీటివ్వనుందని సమాచారం. హీరోయిన్ గా చేసిన సినిమాలు విడుదల కానున్నాయని తెలుస్తోంది.