బాలయ్యతో మరోసారి హానీ రోజ్

Tue Jan 24 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

Honey rose in balayya 108 movie

ఈ సంక్రాంతికి బాలయ్య వీర సింహారెడ్డి గా ప్రేక్షకులను అలరించాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని కురిపిస్తుంది. ఈ సినిమాకి బాలకృష్ణ ఫ్యాన్ గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని 100 కోట్లు కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పోలిస్తే కాస్త వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది.
వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు జోడిగా శృతిహాసన్ హనీ రోజు నటించిన విషయం తెలిసిందే. హనీ రోజ్ ఫస్ట్ ఆఫ్ లో ఓల్డ్ క్యారెక్టర్ గా... సెకండ్ హాఫ్ లో యంగ్ బ్యూటీగా కనిపించి మెప్పించింది. ఆమె అందాలకి ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి. ఇన్నేళ్లు ఈ ముద్దుగుమ్మ మలయాళీ భామ అయినప్పటికీ అక్కడ చేసిన సినిమాలు అంతగా వర్కౌట్ అవలేదు. ఒక వీర సింహారెడ్డి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మెప్పు పొందింది. 2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మలయాళంతో పాటు కన్నడ తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తోంది హనీ రోజ్.

 అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ 108 సినిమాలో మరొక్కసారి హనీ రోజ్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన 108 సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేయనున్నారు. ఈ సినిమాలో హనీ రోజ్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు.

 ఈ సినిమాలో ధమాకా మూవీతో హిట్ కొట్టిన శ్రీలల కూడా కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బాలకృష్ణ-అనిల్ రావిపూడి ఎస్ థమన్‌ల కాంబినేషన్‌లో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార్లాపాటి హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.