ఉపాసన తాతయ్య అంత్యక్రియలకు చిరు.. చరణ్

Sun May 31 2020 13:48:54 GMT+0530 (IST)

Honey bees attack on Chiranjeevi And Ram Charan

ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు ఈ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.  ఉమాపతిరావు గారు దోమకొండ సంస్థానానికి వారసులు.. రిటైర్డు ఐఏఎస్ అధికారి. అమెరికాలో స్థిరపడిన ఉమాపతిరావు గారి కుమార్తె శోభ ఇండియాకు రావడం ఆలస్యం కావడంతో  అంత్యక్రియలు చేయడం ఆలస్యం అయింది.ఈ రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు గడికోటలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.  జిల్లా కలెక్టర్ శరత్ కుమార్..  జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి.. అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్.. అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే ఉమాపతిరావు భౌతికకాయానికి  నివాళులు అర్పించారు. ఇక ఈ కార్యక్రమానికి ఉపాసన.. రామ్ చరణ్.. చిరంజీవి కూడా హాజరయ్యారు.  అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో చిరంజీవి.. ఆయన పక్కన ఉన్న మరి కొందరిపై తేనేటీగలు దాడి చేశాయి.  అక్కడ ఉన్న స్టాఫ్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

మధ్యాహ్నం లక్ష్మీ బాగ్ కు భౌతిక దేహాన్ని తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో బంధువులు.. సన్నిహితులు. హాజరయ్యారు.