గ్రేమ్యాన్ ట్రైలర్ : హాలీవుడ్ మూవీలో ధనుష్ రోల్ ఎంత?

Wed May 25 2022 12:19:11 GMT+0530 (IST)

Hollywood movie trailer starring Dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్ `అవెంజర్స్` దర్శకులు ఆంథోనీ రస్సో .. జోసెఫ్ రస్సో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్ సంగతి తెలిసిందే. 'ది గ్రే మ్యాన్' అనేది టైటిల్. తాజాగా ట్రైలర్ ఆవిష్కరించారు. రెండు నిమిషాల ట్రైలర్ ఆద్యంతం భారీ యాక్షన్ థ్రిల్స్ తో రక్తి కట్టించింది.అయితే ఇందులో ధనుష్ కేవలం ఐదు సెకన్ల పాటు ఫ్లాష్ లా మెరిసాడు. ఈ ట్రైలర్ ఆద్యంతం ర్యాన్ గోస్లింగ్ .. క్రిస్ ఎవాన్స్ కథానాయకుల పాత్రల్లో మెరిపించారు.

మాజీ సిఐఎ కోవర్ట్ ఆపరేషన్ వేట నేపథ్యంలో ట్రైలర్ ఆకట్టుకుంది. వీడియోలో థ్రిల్స్ కి అయితే కొదవే లేదు.

ధనుష్ చేస్తున్నది చిన్న పాత్రే అయినా కానీ కీలకమైన ఫైట్ సీన్ లో కనిపించాడు. అతడి పాత్ర సీరియస్ నెస్ తో కూడుకుని ఉంది. అది తప్ప అతని పాత్ర గురించి ఎటువంటి వివరాలు లేవు. పూర్తి సినిమాలో అతనికి ఎక్కువ స్క్రీన్ సమయం లభిస్తుందని ఆశిస్తున్నాను.

'ది గ్రే మ్యాన్' జూలై 15న చాలా పరిమిత థియేటర్లలో విడుదల కానుంది. అయితే నెట్ ఫ్లిక్స్ లో జూలై 22 నుండి స్ట్రీమింగ్ కోసం ఈ సినిమా అందుబాటులో ఉంటుంది.

ఇటీవలి కాలంలో వచ్చిన పలు ట్రైలర్స్ తో పోలిస్తే ఈ ట్రైలర్ కంటెంట్ ని ఎలివేట్ చేసిన తీరు ఆసక్తిని కలిగిస్తోంది. స్పై యాక్షన్ నేపథ్యం ప్రధాన బలంగా కనిపిస్తోంది. అవెంజర్స్ దర్శకుడి గ్రేమ్యాన్ లో ధనుష్ రోల్ ఎంతసేపు ఉంటుంది? అన్నది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.