అనుష్క మూవీలో హాలీవుడ్ స్టార్.. అసలేంటి?

Sat Jan 12 2019 12:42:33 GMT+0530 (IST)

Hollywood Villain For Tollywood Beauty

'బాహుబలి' చిత్రం తర్వాత అనుష్క వరుసగా పెద్ద సినిమాల్లో నటించడం ఖాయంగా అంతా భావించారు. కాని సైజ్ జీరో కోసం పెరిగిన బరువు ఆ తర్వాత తగ్గలేక పోవడంతో సినిమాలకు కాస్త దూరం అయ్యింది. ఇన్నాళ్లుగా బరువు తగ్గేందుకు పూర్తి సమయం కేటాయించిన అనుష్క భాగమతి తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని ఇన్నాళ్లకు ఒక సినిమాకు ఓకే చెప్పింది. 'వస్తాడు నా రాజు' చిత్రం ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యింది.తమిళ్ హీరో మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మార్చిలో పట్టాలెక్కబోతుంది. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం గురించిన ఒక ఆసక్తికర అప్ డేట్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అదేంటీ అంటే ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను హాలీవుడ్ స్టార్ నటుడు మైఖేల్ మాడ్సన్ ను ఎంపిక చేశారట. ఇప్పటికే ఆయన హాలీవుడ్ లో క్వెంటిన్ టరంటీనోస్ కిల్ బిల్ చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

హాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న మైఖేల్ ఈ చిత్రంలో నటించడం చాలా పెద్ద విషయంగా చెప్పుకోవాలి. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ఎక్కువ శాతం అమెరికాలో నిర్వహించబోతున్నాడు. అక్కడ జరిపే షూట్ లో మైఖేల్ పాల్గొనబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ కథ ఏంటీ అనే విషయం పై క్లారిటీ రాలేదు. ఇప్పుడై హాలీవుడ్ నటుడు ఈ చిత్రంలో నటించనున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ సినిమా ఏంటో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.