రూ. 8.5 వేల కోట్లు రాబట్టిన సినిమాకు సీక్వెల్..!

Sat Aug 06 2022 06:00:01 GMT+0530 (IST)

'Jocker' Movie Collected Rs.8.5 Thousand Crores In Indian Rupees

కేవలం 50 మిలియన్ డాలర్లతో రూపొందిన హాలీవుడ్ మూవీ 'జోకర్' సినిమా 2019 అక్టోబర్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ఏకంగా 1.074 బిలియన్ లు అంటే ఇండియన్ రూపీస్ లో రూ.8.5 వేల కోట్లు వసూళ్లు గా రాబట్టింది.జోకర్ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క దేశంలో కూడా సూపర్ హిట్ అయ్యి.. వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జాబితాలో నిలిచింది.

జోకర్ సినిమా లో నటించిన జోక్విన్ ఫీనిక్స్ ఆస్కార్ అవార్డు ను దక్కించుకున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా మొత్తం 11 కేటగిరీల్లో జోకర్ సినిమా ఆస్కార్ నామినేషన్ ను దక్కించుకుంది. అవార్డులు రివార్డులు అందుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కమర్షియల్ గా ది బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన జోకర్ సినిమా కు సీక్వెల్ రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

జోకర్ సినిమా వచ్చినప్పటి నుండే సీక్వెల్ గురించిన ప్రచారం జరుగుతోంది. కాని యూనిట్ సభ్యులు మాత్రం జోకర్ 2 గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు ఇవ్వలేదు. కాని తాజాగా మాత్రం జోకర్ 2 ను అధికారికంగా ప్రకటించారు. జోకర్ 2 యొక్క విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జోకర్ మొదటి పార్ట్ ను 2019 అక్టోబర్ 4న విడుదల చేయడం జరిగింది. జోకర్ 2 ను సరిగ్గా అదే తేదీన అయిదు సంవత్సరాల తర్వాత అంటే 2024 అక్టోబర్ 4వ తారీకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను జోకర్ 2 జరుపుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలోనే సీక్వెల్ కూడా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది.