Begin typing your search above and press return to search.

అఫిషియల్‌ః టీఎస్‌ హిట్‌ కు సీక్వెల్‌ గా ఏపీ హిట్‌

By:  Tupaki Desk   |   1 March 2021 3:30 AM GMT
అఫిషియల్‌ః టీఎస్‌ హిట్‌ కు సీక్వెల్‌ గా ఏపీ హిట్‌
X
నాని నిర్మాణంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా కొలను శైలేష్‌ దర్శకత్వంలో వచ్చిన 'హిట్‌' సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. థియేటర్లలో మరియు ఓటీటీలో మంచి ఆధరణ దక్కించుకున్న హిట్‌ కు సీక్వెల్‌ ఉంటుందని ముందే ప్రకటించారు. హిట్‌ లో ఒక కేసును ఎంక్వౌరీ చేశారు. సీక్వెల్‌ లో మరో కేసును ఎంక్వౌరీ చేయబోతున్నారు. హిట్ 2 లో కొత్త కేసును చూపించబోతున్నట్లుగా ప్రకటించారు. నాని ఈ సీక్వెల్‌ ను అధికారికంగా ప్రకటించాడు. అయితే ఆసక్తికరమైన విషయాన్ని నాని రివీల్‌ చేసి సినిమా పై ఆసక్తిని పెంచాడు. మొదటి కేసును తెలంగాణ హిట్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ రుద్రరాజు పరిష్కరించగా రెండవ కేసు ఏపీకి చెందినదిగా నాని ట్విట్టర్‌ లో పేర్కొన్నాడు.

హిట్‌ మొదటి పార్ట్‌ లో హీరో తెలంగాణ యాస తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక రెండవ పార్ట్‌ కు వస్తే ఏపీ లో ఈ కేసు ఎంక్వౌరీ సాగుతుందని నాని ప్రకటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈసారి హీరో పాత్ర పేరు కేడీ అంటూ కూడా నాని హింట్ ఇచ్చాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హిట్ సీక్వెల్‌ లో విశ్వక్ సేన్‌ నటించబోవడం లేదని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో అడవి శేషు నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హిట్‌ హిందీ రీమేక్ పనిలో దర్శకుడు ఉన్నాడు. అక్కడ పూర్తి అయిన తర్వాత రెండవ కేసు పని మొదలు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. హిట్ 2 కూడా సక్సెస్ అయితే ముందు ముందు మరిన్ని కేసు(సీక్వెల్‌)లు తీసుకు వచ్చే అవకాశం ఉంది.