Begin typing your search above and press return to search.

హిట్ 3 మల్టీస్టారర్.. డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 9:30 AM GMT
హిట్ 3 మల్టీస్టారర్.. డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..!
X
శైలేష్ కొలను ఏ ముహుర్తాన హిట్ కథ అనుకున్నాడో కానీ ఆ సినిమా ఫ్రాంచైజ్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది. నాని నిర్మాతగా హిట్ ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్ హీరోగా నటించి మెప్పించాడు. తెలుగు ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ క్రైం థ్రిల్లర్ చూపించి డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు శైలేష్. ఇక ఆ కథని కొనసాగిస్తూ హిట్ సెకండ్ కేస్ అదే హిట్ 2 ని అడివి శేష్ హీరోగా పెట్టి మరోసారి సక్సెస్ అందుకున్నారు. నిర్మాతగా నాని.. డైరెక్టర్ గా శైలేష్ ఇద్దరు సూపర్ అనిపించుకున్నారు. హిట్ 2 గ్రాండ్ సక్సెస్ సందర్భంగా నాని హిట్ 1, 2 హీరోలు విశ్వ సేన్, అడివి శేష్ ఇంకా డైరెక్టర్ శైలేష్ పార్టీ చేసుకున్నారు.

టైటిల్ కి తగినట్టుగానే సినిమా కూడా కమర్షియల్ హిట్ కొట్టినందుకు ఈ నలుగురు మంచి మూడ్ లో ఉన్నారు. హిట్ 2 కి తనకు సంబంధం లేకపోయినా విశ్వక్ హిట్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు తను మొదలు పెట్టిన ఈ ఫ్రాంచైజ్ ఇలా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండటం అతనికి కిక్ ఇచ్చింది.

అయితే హిట్ 3లో నాని నటిస్తున్నాడని ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ శైలేష్. అయితే ఈ థర్డ్ కేసు లో కేవలం నాని మాత్రమే కాదు హిట్ 1, 2 హీరోలు కూడా నటిస్తారని తెలుస్తుంది. అవును హిట్ 3 ఒక క్రేజీ మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ శైలేష్.

హిట్ ఫస్ట్ అండ్ సెకండ్ కేస్ రెండిటిలో కేవలం సోలో హీరోలే చేస్తూ వచ్చారు. కానీ థర్డ్ కేస్ భారీగా ఉండబోతుందట. అంతేకాదు హిట్ 3 బడ్జెట్ కూడా పెంచబోతున్నరట. హిట్ 3లో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఈ సీక్వెల్ లో మొదటి రెండు సినిమాల హీరోలు కూడా నటిస్తారు కానీ అది చాలా సీక్రెట్ గా ఉంచాలని శైలేష్ ప్లాన్ చేస్తున్నారట. హిట్ ఫ్రాంచైజ్ లను దాదాపు 7 సినిమాలు చేయాలని అనుకుంటున్న శైలేష్ 3వ సినిమాకే మల్టీస్టారర్ ఎలా చేస్తాడని కొందరు అంటున్నారు. అయితే కథని కొనసాగించడానే ఉద్దేశంతోనే హిట్ 3 ని మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

మొత్తానికి నాని నిర్మాతగా చేస్తున్న హిట్ తెలుగులో ఒక సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. హిట్ 2 ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ కాగా ఈ మూవీని హిందీ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 30న హిట్ 2 హిందీ వర్షన్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. హిట్ 2 తో అడివి శేష్ తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు 4 రోజుల్లోనే సినిమా లాభాల్లోకి వచ్చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.