హిట్ 3 ని దీంతో మరింతగా కన్ఫర్మ్ చేసిన నాని

Tue Dec 06 2022 11:45:21 GMT+0530 (India Standard Time)

Hit 3 Is Further Confirmed By Nani

యంగ్ హీరో నాని వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే ఆయన నిర్మాణంలో హిట్ సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో వెంటనే హిట్ 2 ను మొదలు పెట్టారు. విలక్షణ హీరో అడివి శేష్ హిట్ 2 కు అంతా అనుకున్నట్లుగానే న్యాయం చేశాడు.హిట్ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హిట్ 2 చివర్లోనే హిట్ 3 కి సంబంధించిన హింట్ ఇచ్చారు. నాని గెస్ట్ గా కనిపించడం తో అందరి దృష్టిని ఆకర్షించాడు. నాని నిర్మాణంలో వచ్చిన హిట్ మరియు హిట్ 2 లు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో హిట్ 3 లో ఆయనే స్వయంగా నటించేందుకు సిద్ధం అయ్యాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

తాజాగా నాని షేర్ చేసిన ఈ ఫొటోతో మరోసారి క్లారిటీ వచ్చింది. నాని హిట్ 3 లో అర్జున్ సర్కార్ పాత్రలో నటించబోతున్నట్లుగా ఈ ట్వీట్ తో అధికారికంగా మరోసారి స్పష్టతను ఇవ్వడం జరిగింది.

అభిమానులతో పాటు హిట్ ను ఇష్టపడే వారు నాని ఉంటే కచ్చితంగా హిట్ 3 సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హిట్ 3 లో నాని మాత్రమే కాకుండా మరో హీరో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది అడవి శేషు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు విషయం తెలియాల్సి ఉంది. అతి త్వరలోనే నాని దసరా సినిమా ను ముగించే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే హిట్ 3 ని మొదలు పెట్టే అవకాశం ఉంది.

నాని గత చిత్రం శ్యామ్ సింగరాయ్ తో పాటు మరి కొన్ని సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో ఆయన నుంచి వస్తున్న సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అలాంటి అంచనాల నడుమ రాబోతున్న హిట్ 3 సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.