Begin typing your search above and press return to search.

మ‌హేష్ కంటే ఆయ‌న విల‌నే బెట‌ర్!

By:  Tupaki Desk   |   10 Aug 2020 6:50 AM GMT
మ‌హేష్ కంటే ఆయ‌న విల‌నే బెట‌ర్!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కంటే విల‌న్ సోనూసూద్ బెట‌ర్ అంటూ నెటిజ‌నుల్లో సెటైర్లు వేడెక్కిస్తున్నాయ్‌. బ‌ర్త్ డే బోయ్ మ‌హేష్ చేసిన ప‌ని ఏం బాలేదు అంటూ యాంటీ ఫ్యాన్స్ స‌హా నెటిజ‌‌నం కౌంట‌ర్లతో హీట్ పెంచేస్తున్నారు. ఇంత‌కీ మ‌హేష్ లో న‌చ్చ‌నిది ఏమిటి? అంటే..

నిన్న త‌న‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌హేష్ రెండు మొక్క‌లు నాటి మ‌రో ముగ్గురిని నామినేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పుట్టిన‌రోజున సోష‌ల్ మీడియా రికార్డులు అంటూ ఫ్యాన్స్ చాలానే హ‌డావుడి చేశారు. అయితే ఈ తంతు యాంటీ ఫ్యాన్స్ కి అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో విల‌న్ సోనూ సూద్ తో పోలుస్తూ కౌంట‌ర్ల‌తో చెల‌రేగిపోతున్నారు. మీ కంటే మీ సినిమాల్లో న‌టించిన విల‌న్ బెట‌ర్.. క్రైసిస్ లో కార్మికుల‌కు సోనూసూద్ ఎంతో సేవ చేశాడు. లాక్ డౌన్ లో బ‌తుకుతెరువు క‌ష్ట‌మైన కార్మికుల‌ను పొరుగు ఊళ్ల నుంచి బ‌స్సుల్లో సొంత ఊళ్ల‌కు చేర్చాడు! తిండి లేని వారికి తిండి పెట్టాడు!! అంటూ మ‌హేష్ ని ట్రోల్ చేస్తూ సోనూసూద్ ని తెగ పొగిడేస్తున్నారు.

అయితే పుట్టిన‌రోజును ఎంతో సింపుల్ గా జ‌రుపుకున్న మ‌హేష్ మొక్క‌లు నాట‌డంతో స‌రిపుచ్చినా ఆయ‌న‌కు సోష‌ల్ వ‌ర్క్ చేయ‌డం కొత్తేమీ కాదన్న‌ది ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల రివ‌ర్స్ కౌంట‌ర్. ఇంత‌కుముందు స్వ‌స్థ‌లంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశారు. బుర్రిపాలెం గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని డెవ‌ల‌ప్ చేశారు. అలాగే పలు ప్ర‌యివేట్ ఆస్ప‌త్రుల‌తో క‌లిసి ఆప‌న్నుల‌కు ఆర్థిక సాయం చేస్తున్నారు. క్యాన్స‌ర్ రోగుల‌కు చికిత్స అందించ‌డం.. అనారోగ్యంతో జ‌న్మించిన పిల్ల‌ల‌కు న‌యం అయ్యేందుకు వైద్యానికి త‌మవంతు ఆర్థిక సాయం చేయ‌డం వ‌గైరా వ‌గైరా చాలానే ఉన్నాయి. విప‌త్తుల వేళ‌.. ప‌రిశ్ర‌మ త‌ర‌పున‌ డొనేష‌న్లు ఇచ్చారన్న‌ది ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

సోనూ సూద్ ఇంత‌కుముందు మ‌హేష్ న‌టించిన అత‌డు.. దూకుడు.. ఆగ‌డు వంటి చిత్రాల్లో విల‌న్ గా నటించిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ స‌మయంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల్ని స్వ‌స్థ‌లాల‌కు పంపించి రియ‌ల్ హీరో అయ్యారు.