Begin typing your search above and press return to search.

అమ్మ‌డి హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదుకు `హోండా బైక్` కొనేయొచ్చు!

By:  Tupaki Desk   |   23 Jan 2021 7:30 AM GMT
అమ్మ‌డి హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదుకు `హోండా బైక్` కొనేయొచ్చు!
X
ఖ‌రీదైన కాస్ట్యూమ్స్.. ఖ‌రీదైన హ్యాండ్ బ్యాగ్ లు.. కాలి ఎత్తుమ‌డ‌మ‌లు.. ఇలాంటి వాటికి ఎంత ఖ‌ర్చు చేసేందుకైనా వెన‌కాడ‌ని ఫేజ్ 3 మ‌నస్త‌త్వం పెద్ద రీసెర్చ్ స‌బ్జెక్ట్ లాంటిది. హిందీ టీవీ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టీమ‌ణులు కోట్ల‌లో ఆర్జిస్తూ ల‌క్ష‌ల్లో వీటి కోసం ధార‌పోస్తుంటారు. ప‌ర్ఫెక్ట్ కాస్ట్ లీ బ్రాండ్ ని మాత్ర‌మే ఎంపిక చేస్తూ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించ‌డం ఈ భామ‌ల ప్ర‌త్యేక‌త‌. ఆ కోవ‌కే చెందుతుంది బిగ్ బాస్ బ్యూటీ హీనా ఖాన్.

హీనా ఖాన్ వార్డ్రోబ్ కాస్ట్ లీ వ‌స్తువుల‌తో ల‌గ్జ‌రీగా సిద్ధంగా ఉంటుంద‌ట‌. మేకప్ విష‌యంలో ఎంతో క్రేజీగా ఆలోచించ‌డం త‌నకు తొలి నుంచి అల‌వాటు. ముఖ్యంగా ఖ‌రీదైన‌ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇటీవల `గూచీ బ్యాగ్` బ్రాండ్ తో నగరంలో ప్ర‌త్య‌క్ష‌మైంది హీనా. ఓఫిడా సాఫ్ట్ జిజి సుప్రీం మీడియం టోట్ బ్యాగ్ ఇది.

టోట్ బ్యాగ్ బ్రౌన్ .. ఎబోనీ రంగులలో ఈ బ్యాగ్ అందుబాటులో ఉంటుంది. బ్యాగ్ ధర 1750 డాల‌ర్లు. మనం దీన్ని భారతీయ కరెన్సీగా మార్చుకుంటే దాని విలువ‌ రూ .127750. ఆ మొత్తంతో హై-ఎండ్ ల్యాప్‌టాప్ లేదా ప‌వ‌ర్ ఫుల్ హోండా బైక్ ‌ను కొనుగోలు చేయవచ్చు. లేదా మాల్దీవుల వెకేష‌న్ నే ఎంజాయ్ చేసేయొచ్చు.

టీవీ స‌ర్కిల్స్ లో అత్యధిక పారితోషికం తీసుకునే భామ‌ల్లో హీనా ఖాన్ ఒకరు. కాబట్టి ఇలాంటి ఖ‌రీదైన డిజైనర్ బ్యాగ్ ల‌ను సొంతం చేసుకోవ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. గూచీ.. కోచ్.. సెయింట్ లారెంట్ వంటి ప్ర‌ఖ్యాత‌ బ్రాండ్లు త‌న సొంతం చేసుకుంది.

హినా ఖాన్ ఇటీవల బిగ్ బాస్ 14 లో టూఫానీ సీనియర్ ‌గా కనిపించింది. ఈ నటి హౌస్ ‌మేట్స్ నుంచి ఎంతో ప్రేమను సంపాదించింది. హీనా ఖాన్ బిగ్ బాస్ 11 రన్నరప్. ఆమె ఇంటి నుంచి నిష్క్రమించిన తరువాత,.. న‌టిగా కెరీర్ మ‌రో లెవ‌ల్ కి చేరుకుంది. హౌస్ నుంచి తన నిష్క్రమణ తర్వాత స్వతంత్ర చిత్రాలు... మ్యూజిక్ వీడియోలను రూపొందించి క్రేజు పెంచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ వాక్ కి అవ‌కాశం ద‌క్కించుకోవ‌డంతో హీనా ఖాన్ మీడియాలో ప్ర‌ముఖంగా హైలైట్ అయ్యింది.