నేను మళ్లీ బిగ్ బాస్ కు రాను..భలే ట్విస్ట్ ఇచ్చిందే..

Mon Sep 23 2019 11:00:01 GMT+0530 (IST)

Himaja Eliminated From Bigg Boss 3 House

అంతా ఊహించినట్లుగానే బిగ్ బాస్ హౌస్ నుంచి హిమజ ఎలిమినేట్ అయింది. ఆదివారం ఎపిసోడ్లో హిమజ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే శనివారం ఎపిసోడ్ లో రాహుల్ ను ఎలిమినేట్ చేసినట్లు చేసి...అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి...మళ్ళీ రాహుల్ ని బిగ్ బాస్ ప్రత్యేక గదిలోకి పంపారు. బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాహుల్ ఆ రూమ్ లోనే ఉంటాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులు ఉన్న చోటకు వెళ్లతాడు. అయితే రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ అయ్యాడని తెలియక వరుణ్ పునర్నవిలు తెగ బాధపడిపోవడం ఆదివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున మన టీవీ ద్వారా చూపించారు.ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులతో సరదా గేమ్ ఆడించిన నాగార్జున స్పెషల్ గెస్ట్ వరుణ్ తేజ్ ని షోలోకి తీసుకొచ్చాడు. వరుణ్ కాసేపు ఇంటి సభ్యులతో సరదా మాట్లాడాడు. నెక్స్ట్ మహేశ్ - హిమజల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పాలని నాగ్ వరుణ్ ని కోరాడు. దీంతో వరుణ్ తన జేబులో స్లిప్ తీసి...హిమజ పేరు చెప్పడంతో...ఆమె ఈ వారం ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే హిమజ తనదైన స్టైల్ లో డేరింగ్ డేషింగ్ అంటూ నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది.

అలాగే స్టేజ్ మీదకొచ్చిన హిమజ చేత...నాగ్ ఓ టాస్క్ ఆడించారు. ఇంటి సభ్యుల్లో....గుడ్ - బ్యాడ్ - అగ్లీ ఎవరో చెప్పి కారణాలు చెప్పాలని కోరారు. దీంతో హిమజ...శివజ్యోతి - రవి - వరుణ్ - శ్రీముఖిలు గుడ్ అని...మహేశ్ - వితికా - పునర్నవిలు బ్యాడ్ అని - బాబా భాస్కర్ అగ్లీ అని చెప్పింది. బయటకు వచ్చిన హిమజ చాలా హుందాగా ప్రవర్తించింది. మళ్లీ అవకాశం ఇస్తే లోపలి వస్తారా ? అన్న ప్రశ్నకు హిమజ ఇచ్చిన సమాధానం అందర్నీ మరోసారి హిమజ కు జై కొట్టేలా చేసింది.

''నేను వెళ్లను సార్.. ఒకసారి ఎలిమినేట్ అయిన తరువాత మళ్లీ వెళ్లడం అనేది ఫెయిర్ కాదు. అది వన్ టైం డ్రీమ్ మాత్రమే'' అంటూ నిక్కచ్చిగా సమాధానమిచ్చింది. దీంతో నాగార్జున సైతం ఆమెను ప్రశంసించాడు.