Begin typing your search above and press return to search.

2022 ఫస్ట్ హాఫ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు..!

By:  Tupaki Desk   |   7 July 2022 5:30 AM GMT
2022 ఫస్ట్ హాఫ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు..!
X
పాండమిక్ తర్వాత భారతీయ సినిమా తిరిగి పుంజుకుంది. అంతా నార్మల్ అవడంతో ఎప్పటిలాగే సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. చూస్తుండగానే ఈ ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయింది. ప్రథమార్థంలో పలు పాన్ ఇండియా సినిమాలు - భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని ప్రేక్షకాదరణ దక్కించుకొని బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే.. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 2022లో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

1. 'KGF: చాప్టర్-2' : 'కేజీఎఫ్' చిత్రానికి సీక్వెల్ గా కన్నడ హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1228.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. దీంతో 2022లో బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ మూవీగా.. వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది.

2. 'RRR' : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సంచలన విజయం సాధించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా రూ. 1131.1 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ మల్టీస్టారర్ మూవీ.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

3. 'విక్రమ్' : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. కమల్ హోమ్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి - ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించారు. ఏప్రిల్ 3న ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలోకి వచ్చింది.

3. 'ది కాశ్మీర్ ఫైల్స్' : వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ. 344.2 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా 2022లో నాలుగో అతి పెద్ద విజయంగా నిలిచింది. మార్చి 11న ఈ సినిమా రిలీజ్ అయింది.

5. 'భూల్ భూలైయా 2' : కార్తీక్ ఆర్యన్ - కియరా అద్వాణీ - టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్ కామెడీ ఇది. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై రూపొందించారు. 'భూల్ భూలైయా' ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా రూ. 263.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇకపోతే 2022 లో విజయ్ నటించిన 'బీస్ట్' మూవీ 227.3 కోట్లు వసూలు చేసి తరువాత స్థానంలో నిలిచింది. అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 203.9 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రం రూ.192.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ జాబితా ఇదొక్కటే ప్రాంతీయ సినిమా కావడం విశేషం.