అకీరానందన్ లో హిడెన్ ట్యాలెంట్!

Tue May 24 2022 14:01:25 GMT+0530 (India Standard Time)

Hidden Talent in Akiranandain!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత నట వారసత్వాన్ని అకీరానందన్ అందుకోవాల్సి ఉంది. ఇప్పటికే అకీరా ఎంట్రీ పై చిలవలు పలవలుగా మీడియాలో కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. మరి  అకీరా  నటుడిగా ఎంట్రీ ఇస్తాడా?  లేదా? అన్నది క్లారిటీ లేదు గానీ అభిమానులు మాత్రం  పవన్ వారసుడిగా అకీరాని వెండి తెరపై చూసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.అకీరా పుట్టిన రోజు వచ్చినా....నాన్న తో కలిసి కనిపించినా అభిమానుల ఆనందానికైతే అవధులు లేవ్. పవన్ తో సమానంగా అకీరాని అభిమానిస్తారు. భార్య భార్తలుగా పవన్ -రేణుదేశాయ్ విడిపోయినా వారసుడిగా మాత్రం అకీరా ఎప్పుడూ ప్రత్యేకమే. తాజాగా అరీరాలో హిడెన్ ట్యాలెంట్ బయట పడింది. నిన్నటితో అకీరాందన్ న్ స్కూల్  గ్రాడ్యుయేషన్ పూర్తయింది.

ఈ సందర్భంగా అకీరా స్పెషల్ పెర్పార్మెన్స్ ఇచ్చాడు. 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో దోస్తీ సాంగ్ ని పియానోపై వాయించి తనలో ఇన్నర్ ట్యాలెంట్ ని బయట పెట్టాడు అకీరా. నిజంగా చాలా చక్కగా పియానో వాయించాడు. మ్యూజిక్ రంగంలోకి దిగితే రాణించగలడ న్న కాన్పి డె న్స్ కనిపిస్తుంది.  దానికి సంబంధించిన వీడియో ఒకటిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇప్పటివరకూ అకీరా లో ఈ ట్యాలెంట్ ఉందని ఎప్పుడూ బయట పడలేదు. తొలిసారి విషయం బయటకు రావడంతో అకీరా మ్యాకప్ వేసుకోవడానికి బధులుగా మ్యూజిక్ ఇనిస్ర్ట్టుమెంట్స్ పట్టుకుంటాడా? అన్న సందేహం అభిమానుల్లో మొదలైంది. దోస్తీ సాంగ్ వాయిస్తున్న సమయంలో తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ కూడా ఉన్నారు.

తనయుడిలో ఈ ప్రతిభని చూసి పాదర్-మదర్ ఎంతో మురిసిపోయారు. కుమారుడు  పైకి రావాలని ఆశీర్వదించారు. వేదికపై అకీరా తల్లిదండ్రులతో కలిసి ఫోటోలు దిగాడు. మరి తనయుడ్ని ఇలా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం రేణు దేశాయ్ అనే చెప్పాలి.  విడిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరు తల్లితోనే  ఉన్నారు. రేణు పూణే లో స్థిరపడ్డారు.

మరాఠి సినిమాలు   నిర్మిస్తున్నారు. అక్కడే  పిల్లల చదువులు సాగుతున్నాయి.  అకీరా నటుడు అవుతాడా? ఇంకేదైనా రంగంలో రాణిస్తాడా? అన్నది అతని ఇష్టంపైనే అధార పడి ఉంటుందని రేణు ఇప్పటికే వెల్లడించారు. మరి అకీరా మనసులో ఏముందో.