ముంబైలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్లు?

Wed Jun 16 2021 12:00:54 GMT+0530 (IST)

Heroines caught committing prostitution in Mumbai?

రంగుల మాయా ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఈ రంగంలో అవకాశాలు ఉన్నంతవరకూ అంతా సవ్యంగానే సాగుతుంది. ఉపాధి కరువై ఆ తర్వాత ఒకసారి తప్పుదారిలో డబ్బు సంపాదించడం ప్రారంభిస్తే ఆ తర్వాత పర్యవసానాలు అంతే దారుణంగా ఉంటాయి. అందుకు ఇంతకుముందు శ్వేతాబసు ప్రసాద్ ఉదంతం పెద్ద సాక్ష్యంగా నిలుస్తుంది.తాజాగా ఇద్దరు తమిళ హీరోయిన్లు ముంబైలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడడం సంచలనంగా మారింది. కేవలం కథానాయికలు మాత్రమే కాదు.. వారితో పాటు టాప్ మోడల్స్ కూడా ఉన్నారని పోలీసులు నివేదిస్తున్నారు. నిజానికి ఈ రాకెట్ లో చిక్కింది తాము మాత్రమే కాదని తమతో పాటు పలువురు నటీమణులు మోడల్స్ చాలా మంది ఉన్నారని వారంతా సంపాదించుకుని వెళ్లారని కూడా సదరు హీరోయిన్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.

రంగుల ప్రపంచంలో అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తున్నదే... కానీ ఈసారి ఇలా వ్యభిచార కూపంలో చిక్కుకోవడానికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే సదరు కథానాయికలు చెప్పిన కారణం నిశ్చేష్టులను చేస్తోంది. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారీ ఆర్టిస్టులకు ఇండస్ట్రీ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తోంది. ఇటీవల సినిమాల్లేక కనీస మెయింటెనెన్స్ కి కూడా కష్టమై చివరికి ఇలా తప్పుడు మార్గంలో సంపాదించాల్సిన ధైన్యం నెలకొందని సదరు హీరోయిన్లు చెప్పారు.

గత జనవరిలోనూ ఓ ఇద్దరు తమిళ హీరోయిన్లు ముంబైలో పోలీసుల రైడ్ లో వ్యభిచారం చేస్తూ చిక్కారు. ఇలాంటి చెదురుముదురు ఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఆర్జన ఉన్నప్పుడు  దాచుకోకుండా జల్సాలకు అలవాటు పడిన కథానాయికలకే ఇలాంటి పరిస్థితి దాపురిస్తోంది. బతకడానికి విచ్చలవిడి మార్గంలో వెళితే ఇలాంటి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు.