సైరా ఈవెంట్లో హీరోయిన్లు మిస్సయ్యారే

Sun Sep 22 2019 22:40:42 GMT+0530 (IST)

Heroines Not Attending for Sye raa Pre Release Event

సైరా ఈవెంట్ నేటి సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీ దిగ్గజాలు చాలా మంది హాజరయ్యారు. వేలాది మంది మెగాభిమానులు ఎటెండయ్యారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ - పవన్ కల్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. చిరుకి తమ్ముడితో సమానం అయిన వీవీ వినాయక్ హీరో గెటప్ (హీరో అవుతున్నారుగా)లో దర్శనమిచ్చారు. ఎస్.ఎస్.రాజమౌళి- కొరటాల వంటి ఉద్ధండులు సైరా సినిమాని ప్రశంసిస్తూ ప్రసంగాలు కొనసాగించారు.అంతా బాగానే ఉంది కానీ.. ఈ వేదికపై అసలు సిసలు గ్లామర్ మిస్సయ్యింది. కథానాయికల మిస్సింగ్ వల్ల వేదిక కళ తప్పినట్టే అనిపించింది. ఎంతమంది ఉద్ధండులు ఉన్నా అందాల భామల అభినివేశం వేదికపై లేకపోతే మాస్ కి మరీ అంతగా రుచించదు. ఇంత పెద్ద ఈవెంట్ కి కనీస మాత్రంగా ఎవరో ఒకరు ఉండి ఉంటే బావుండేదనే అభిప్రాయం అభిమానుల్లో వినిపించింది.

ఇంతకీ సైరా చిత్రంలో నటించిన క్రేజీ భామలు నయనతార.. తమన్నా ఎక్కడ? ఆ ఇద్దరూ ఈ వేదికపై సందడి చేస్తారని భావిస్తే ఇలా హ్యాండిచ్చారేం?  పైగా ఎప్పుడూ ప్రమోషన్ కార్యక్రమాలకు రానని బెట్టు చేసే నయన్ బెట్టు వీడి వస్తోందన్నారు. తనని చిరు స్వయంగా ఒప్పించారని మీడియాల్లో కథనాలు ఊదరగొట్టారు. కానీ భారీ ఖర్చుతో ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే వేదికపై తను కనిపించలేదేమిటో? కనీసం తమన్నా అయినా కనిపించలేదు ఎందుకో.  మరి ఆ ఇద్దరూ ఔటాఫ్ ది స్టేషన్ అనుకోవాలా.. లేక కావాలనే స్కిప్ కొట్టారా? అసలేం జరిగింది.. అన్నది తెలియాల్సి ఉంది.