ఆ హీరోయిన్ ఆఫర్ ను గద్దలా తన్నుకుపోయిందా?

Mon Feb 24 2020 22:00:01 GMT+0530 (IST)

Heroines Grabs Other Heroine Movie Offer

ఆమె ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.  క్రేజ్ ఉంది కానీ పెళ్లి తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దాదాపుగా తగ్గిపోయాయి.  లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి బయట ప్రచారంలో ఉన్నంతగా హిట్లు కావడం లేదు.  దీంతో ఏమనుకుందో ఏమో కానీ ఇతర హీరోయిన్ల ఛాన్సులపై కన్నేసిందట.  ఈమధ్యే ఒక క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ఆఫర్ ను తన టాలెంట్ తో పట్టేసి వేరే హీరోయిన్ ను షాక్ ఇచ్చిందట.సంక్రాంతి సూపర్ హిట్ సాధించిన దర్శకుడు తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలో నిజానికి ఈ హీరోయిన్ ను తీసుకోలేదట. మరో హీరోయిన్ ను తీసుకున్నారట.  ఆ హీరోయిన్ మరో సంక్రాంతి హిట్టులో నటించింది.  అయితే సంక్రాంతి హీరోయిన్ కు ఈ కొత్త ప్రాజెక్ట్ ఖాయం అయిన తర్వాతే మన మ్యారీడ్  హీరోయిన్ ఎంటర్ అయ్యి గేమ్ ప్లే చేసిందట.  హీరోగారు.. దర్శకుడు తనకు క్లోజ్ కావడంతో వారిని ఒప్పించి మరో హీరోయిన్ ను తప్పించిందట.  ఆ స్థానంలోకి ఎంచక్కా చేరిందట.  హీరోగారు సిఫార్సు చెయ్యడంతో ఇక ఎదురు లేకుండా పోయింది.

ఈ స్టార్ హీరోయిన్ రాజకీయం అంతా బాగానే ఉంది కానీ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ కు ఇన్ని పాలిట్రిక్స్ తెలియవట.  దాంతో సుమక్క అవాక్కయ్యారా అని అడిగినప్పుడు జనాలు అవాక్కయినట్టుగా అవాక్కయిందట.  ఏదేమైనా మరో హీరోయిన్ ఆఫర్ ను లాస్ట్ మినిట్ లో గద్దలా తన్నుకుపోయిన హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని సమాచారం.