టాప్ స్టోరి:హాట్ గాళ్స్ సైలెంట్ కిల్లర్స్

Tue Nov 19 2019 07:00:02 GMT+0530 (IST)

Heroines Comback Silently and Gets Success in Bollywood

ఒకసారి  ఐరెన్ లెగ్ అని ముద్ర వేయించుకుని... ఫేడవుట్ స్టార్ అని పిలిపించుకుని తిరిగి కంబ్యాక్ అయితే ఏమని అనాలి?  పెళ్లి అనో.. లేక అనారోగ్యం అనో వెళ్లిపోయి తిరిగి వచ్చి కెరీర్ ని నిలబెట్టుకోగలిగితే.. క్రేజు సంపాదించగలిగితే కచ్ఛితంగా అలాంటి ట్యాలెంటును పొగిడి తీరాల్సిందే.ఈ కేటగిరీలో హాట్ గాళ్స్ సైలెంట్ కిల్లర్స్ ఎందరున్నారు? అన్నది ఆరాతీస్తే తెలిసిన సంగతులివి. హాట్ హాట్ అందాలతో ఆకట్టుకున్న భామల్లో కెరీర్ తొలి నాళ్లలో కృతి కర్బందా- అదా శర్మ వంటి హీరోయిన్ లకు సరైన హిట్ లు లేవు. ఇక చిరుత లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ సన్నివేశం అదే. కానీ వీరంతా ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతున్నారు. కంబ్యాక్ ని ఘనంగా చాటుకునే టైమ్ వచ్చేస్తోంది.

తెలుగులో నితిన్ నటించిన `హార్ట్ ఎటాక్`తో ఎంట్రీ ఇచ్చింది ఆదా శర్మ. తొలి సినిమా ఫరవాలేదనిపించిందే కానీ ఆదాశర్మకు మాత్రం ఎలాంటి క్రేజ్‌ని అందించలేకపోయింది. హిందీలో ప్రయత్నాలు చేసినా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. కమెండో చిత్రంతో తొలి హిట్ ని సొంతం చేసుకున్న ఆదాశర్మ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ క్రేజీ కథానాయికగా గుర్తింపుని సొంతం చేసుకుంటోంది. కృతి కర్బందా పరిస్థితీ అంతే తొలి నాళ్లలో ఫ్లాప్ లు చూసిన కృతి తాజాగా సైలెంట్ కిల్లర్ గా హిట్ లు సొంతం చేసుకుంటోంది. ఇటీవలే ఈ అమ్మడు హౌస్ ఫుల్ 4 లాంటి హిట్ చిత్రంలో నటించింది. నేటి ట్రెండ్ లో హిట్ గాళ్స్‌గా పేరు తెచ్చుకున్న ఆదా- కృతి సైలెంట్ గా కంబ్యాక్ అంటూ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు.

వీరి బాటలోనే నేహా శర్మ సైతం ప్రస్తుతం ఓ రెండు చిత్రాలకు సంతకం చేసి బిజీ అవుతోందిట. వీటిలో ఒక్కటి హిట్టయినా వరుసగా ఛాన్సులొస్తాయి. బిజోయ్ నంబియార్ తైస్ అనే చిత్రంలో ఈ అమ్మడు నటిస్తోంది. పెళ్లాడి అటుపై విడాకుల అనంతరం కంబ్యాక్ అయ్యింది అమలాపాల్. కెరీర్ ఆరంభం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని స్టార్ డమ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ కూడా. ప్రస్తుతం కంబ్యాక్ అయిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. కెరీర్ తొలి నాళ్లలో ఎలాంటి హిట్ లని సొంతం చేసుకోని భామలంతా కాలం కలిసి రావడంతో ప్రస్తుతం సైలెంట్ కిల్లర్స్ గా హిట్ లు సాధించేస్తున్నారు. తిరిగి బిజీ అవుతున్నారు. ఇదో రకం ట్రెండ్ అన్నమాట.