వీడియో : హీరో షో లో హీరోయిన్స్ బెల్లీ డాన్స్

Sun Oct 24 2021 12:09:36 GMT+0530 (IST)

Video: Heroines? Belly Dance in Hero Show

బాలీవుడ్ స్టార్ హీరోలు పలువురు హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. అమితాబచ్చన్ నుండి మొదలుకుని ఎంతో మంది హీరోలు హోస్ట్ లుగా మారారు. కొందరు ఇంకా కంటిన్యూ అవుతుంటే కొందరు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లారు. సల్మాన్ ఖాన్ సుదీర్ఘ కాలంగా బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతర హీరోలు పలువురు టాక్ షో లను డాన్స్ షో లను హోస్ట్ చేయడం లేదా జడ్జ్ చేయడం జరిగింది. వారి దారిలోనే బాలీవుడ్ యంగ్ సెన్షేషన్ రణ్ వీర్ సింగ్ కూడా హోస్ట్ గా అవతారం ఎత్తాడు. కలర్స్ టీవీలో ఇతడు ది బిగ్ పిక్చర్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నాడు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ పాల్గొంటున్నారు. వారి నుండి సరదా ముచ్చట్లను ఈ యంగ్ హీరో రాబడుతూ వారితో గేమ్స్ కూడా ఆడుకుంటున్నాడు.తాజాగా ఈ షో లో ఇద్దరు బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీస్ అయిన సారా అలీ ఖాన్ మరియు జాన్వీ కపూర్ లు పాల్గొన్నారు. వీరిద్దరు కూడా రణ్ వీర్ సింగ్ తో సరదాగా షో లో గడిపినట్లుగా ప్రోమోస్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. నెట్టింట ప్రస్తుతం ఈ షో లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతోంది. అందులో జాన్వీ కపూర్ మరియు సారా అలీ ఖాన్ లు బెల్లీ డాన్స్ చేస్తుండగా వారిని రణ్ వీర్ సింగ్ అనుసరించడం జరిగింది. బెల్లీ డాన్స్ లో జాన్వీ కపూర్ అదరగొట్టింది.  సారా మరియు రణ్ వీర్ లు ఆమెను అలా చూస్తూ ఉన్నారు. జాన్వీ కపూర్ బెల్లీ స్టెప్పులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ షో ఉంటుందనే టాక్ వచ్చింది.

రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ అండ్ వాంటెడ్ హీరో. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న రణ్ వీర్ సింగ్ ఇప్పుడు హోస్ట్ గా మారడం ను అంతా అభినందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఇలా అన్ని రంగాల్లో అన్ని ప్లాట్ ఫామ్స్ లో కూడా కనిపించాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే హోస్ట్ గా రణ్ వీర్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈయన సినిమాలు బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకుంటున్నట్లుగానే ఈ షో కూడా ఇప్పటి వరకు మంచి టాక్ ను దక్కించుకుంది. సారా మరియు జాన్వీల ఎపిసోడ్ ఖచ్చితంగా మంచి రేటింగ్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.