Begin typing your search above and press return to search.

నిర్మాణ సంస్థపై కోర్టుకు వెళ్లిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   30 July 2021 9:00 AM GMT
నిర్మాణ సంస్థపై కోర్టుకు వెళ్లిన హీరోయిన్‌
X
సాధారణంగా ఏదైనా అగ్రిమెంట్ జరిగితే దానిలోని కండిషన్స్‌ను ఇరు వైపుల వారు పాటించాలి. ఒకవేళ ఏ కండిషన్‌ను పాటించపోతే అగ్రిమెంట్ బ్రేక్ అయ్యే చాన్స్ ఉంటుంది. అయితే, సాధారణంగా పెద్ద సంస్థలతో ఇలాంటి అగ్రిమెంట్స్ జరిగితే నిబంధనలు పాటించక పోయినా యాక్సెప్ట్ చేసేస్తుంటారు కొందరు నటులు. కానీ, మనం ఇప్పుడు చర్చించబోతున్న ఈ హీరోయిన్ అతి పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌ పై పోరుకు సిద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘించడం సరి కాదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టు మొట్లెక్కింది.

ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు? ఆమె పోరాటం ప్రకటించిన నిర్మాణ సంస్థ ఏది? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాల్సిందే. అమెరికన్ ఫేమస్ యాక్ట్రెస్ స్కార్లెట్ జాన్సన్ గతంలో ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా గుర్తింపు పొందింది. ఈమె సినిమా వచ్చిందంటే చాలు యాక్షన్, సినీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతుంటారు. అంతలా సినీ లవర్స్‌కు ఇష్టమైన యాక్ట్రెస్ స్కార్లెట్.

స్కార్లెట్, ప్రొడక్షన్ హౌజ్ డిస్నీ హాట్ స్టార్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈమె నటించిన ‘బ్లాక్ విడో’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ బాట పట్టాలి. కానీ, ఆ నిబంధనను అతిక్రమించి నిర్మాణ సంస్థ డిస్నీ హాట్‌స్టార్ ఒకేసారి థియేటర్లతో పాటు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయం పట్ల స్కార్లెట్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆమె వాదన ప్రకారం..‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఓటీటీల్లో ఒకేసారి విడుదల చేస్తే.. థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయం ఆటో‌మేటిక్‌గా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె డిస్నీ హాట్‌ స్టార్ నిర్ణయాన్ని తప్పు బడుతోంది. ఈ విషయమై చట్ట ప్రకారం వెళ్లబోతుంది స్కార్లెట్. లా సూట్ వేయడంపై డిస్నీ హాట్‌ స్టార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

హాలీవుడ్‌లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉండి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరైన ముద్దుగుమ్మ స్కార్లెట్. హీరోలకు సరి సమానంగా రెమ్యునరేషన్ ప్లస్ వాటా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ‘బ్లాక్ విడో’ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ డిస్నీ హాట్ స్టార్ వాళ్లతో ఒప్పందం చేసుకుంది. కరోనా వల్ల సినీ రంగంతో పాటు ఇతర రంగాలన్నీ లాస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే డిస్నీ హాట్ స్టార్ తన నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘బ్లాక్ విడో’ మూవీని థియేట్రికల్ ప్లస్ డిజిటల్ రిలీజ్ చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే అమౌంట్‌ తో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆలోచిస్తుందని సమాచారం. మారిన పరిస్థితుల వల్ల ప్రజెంట్ ఓన్లీ థియేట్రికల్ రిలీజెస్‌ పై ఆధారపడే పరిస్థితి అయితే లేదు. కాల పరిస్థితులను బట్టి డిజిటల్ ఓటీటీల్లోనూ చిత్రాలను తప్పక విడుదల చేయాల్సి ఉంటుంది.

అమెరికన్ హాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు ఇండియాలోని సినీ ఇండస్ట్రీస్ కూడా డిజిటల్ రిలీజెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ముందే తమ చిత్రాలను డిజిటిల్ ఓటీటీస్ వేదికగా రిలీజ్ చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు టాకీసుల్లో విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అసలే కరోనా వల్ల నిర్మాతలు వందల నుండి వేల కోట్ల వరకు నష్టపోయి ఉన్నారు.

ఇలాంటి సమయంలో కేసులు.. అగ్రిమెంట్‌ లు అంటూ నిర్మాతలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేట్రికల్‌ ప్రదర్శణ వల్ల వచ్చే మొత్తం గురించి చర్చించి ఎంతో కొంత మొత్తంను డిమాండ్ చేయడం కోసం ఆమె ఇలా కోర్టుకు వెళ్లిందనే ఆరోపణలు కూడా కొందరు చేస్తున్నారు.