ప్లీజ్.. మా నాన్నను కాపాడండిః హీరోయిన్

Mon May 03 2021 08:00:02 GMT+0530 (IST)

Heroine samyuktha Latest Pic Goes viral

కరోనా మహమ్మారి అందరినీ హడలెత్తిస్తోంది. వారూవీరనే తేడా లేకండా అన్ని వర్గాల ప్రజలనూ ఏడిపిస్తోంది. తాజాగా.. ఓ హీరోయిన్ తీవ్ర ఆవేదనతో తన తల్లిదండ్రులను కాపాడాలని వేడుకుంటోంది. తెలిసిన వారు అవకాశం ఉన్నవారు సహాయం చేయాలని ప్రార్థిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే!తన తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్ బారిన పడ్డారట. అయితే.. ఆయన పరిస్థితి ఆందోళన కరంగా ఉందని అతి ముఖ్యమైన రెమ్ డెసివర్ ఇంజక్షన్ దొరకట్లేదని అల్లాడిపోతోంది. ‘‘నా తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. నా తండ్రికి రెమ్ డెసివర్ టీకా అత్యవసరం. ఆయనకు ఆరు ఇంజక్షన్లు కావాలి. దానికోసంఎంతో మందిని సంప్రదించాను. కానీ దొరకట్లేదు. బెంగళూరులోని ఇంట్లోనే ఉంచి చూసుకుంటున్నాను.’’ అని తెలిపింది.

‘‘రెమ్ డెసివర్ ఇంజక్షన్లు ఇచ్చేవాళ్లు ఎవరైనా ఉంటే.. వాళ్ల నంబర్ నాకు మెస్ చేయండి. దయచేసి నాకు సహాయం చేసి నా తల్లిదండ్రులను కాపాడండి ప్లీజ్’’ అని వేడుకుంటోంది సంయుక్త. పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈమె.. తెలుగులో ‘కిరాక్ పార్టీ’ చిత్రంలో కనిపించింది.