ప్రెండ్షిప్ కోసం సూసైడ్ కి రెడీ అయిన హీరోయిన్!

Sat May 14 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

Heroine ready to commit suicide for friendship

ట్యాలెంటెడ్ గాళ్ మౌనీ రాయ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన మల్టీ ట్యాలెంటెడ్   బ్యూటీ. బాలీవుడ్ సినిమాల కన్నా బుల్లి తెరపై ఎక్కువ గా ఫేమస్ అయింది. `నాగిని` సీరియల్ తో తెలుగు నాట ఎంతో  పాపులర్ అయింది. ఇటీవలే అమ్మడు వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ ని వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన జట వివాహ బంధంతో ఒకటయ్యారు.ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తుంది. వీలైనంత సమాయాన్ని కుటుంబానికి ..భర్త కోసమే కేటాయిస్తుంది. తాజాగా  మౌనీ రాయ్  తన బెస్ట్ బ్రెండ్ రూపాలి బర్త్ డే సందర్భంగా ఫోటోల్ని షేర్ చేసి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ``నన్ను 50వ అంతస్తు మీద నుంచి అమాంతం దూకేయామన్నా ఏమాత్రం ఆలోచించకుండా దూకేస్తాను.

నీతో గొడవపడిన ప్రతీసారి నీతో కొన్ని నెలలు పాటు మాట్లాడకుండా ఉండాలనుకుంటాను. కానీ ఒక్క గంట కూడా సాధ్యపడటం లేదు. అంటే నువ్వు ఎంత ఇష్టమో నాకిలా ప్రతీసారి గుర్తు చేస్తుంది అ సందర్భం. ఇన్నేళ్ల  నా జీవితంలో అలాంటి సందర్భాలు ఎన్నోసార్లు వచ్చి వెళ్లాయి. నేను మారలేదు. నువ్వు మారలేదు. మన స్నేహం అంత స్వచ్ఛంగా ఉంది కాబట్టే..ఏరోజు ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రాలేదు.

హ్యీపీ బర్త్ డే రూప్సీ.. మనం ఇలాగే ఎన్నో న్యూ ఇయర్ వాలైంటైన్స్ డే..హోలీ సహా అన్నిరకాలు శుభకార్యాలు జరుపుకోవాలి. నువ్వు నాదానివి. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అని మౌనీ రాయ్ ఇన్ స్టాలో సుదీర్థంగా రాసుకొచ్చింది. మౌనీ పోస్ట్ ని బట్టి రూపాలి అంటే తనకి ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.

కొందరికే జీవితాల్లో బెస్ట్ ప్రెండ్ అంటూ ఒక్కరే ఉంటారు. వాళ్లతో ప్రయాణం ఎంతో సాపిగా ఉంటుంది. ఆ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సర్దుకుపోయి ముందుకు సాగితేనే  బెస్ట్ ప్రెండ్స్ అవుతారు. అలాంటి బెస్ట్ స్నేహితుల్లో మౌనీరాయ్- రాపాలి కూడా నిలుస్తారు.

మౌనీ రాయ్ బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది.  `గోల్డ్` అనే హిందీ సినిమాలో తొలిసారి నటించింది. ఆ తర్వాత  `మేడిన్ చైనా`..`లండన్ కాన్పిడెంటల్`..` రోమియో అక్బర్` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం `బ్రహ్మస్ర్త` మొదటి భాగంలోనూ నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.  అలాగే బుల్లి తెరపైనా కొన్ని షోలకు హోస్టింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.