మహేష్ హీరోయిన్ సర్జరీ చేయించుకుందా?

Sat Oct 01 2022 19:29:58 GMT+0530 (India Standard Time)

Heroine pooja hegde cosmetic surgery rumour

టాలీవుడ్ హీరోయిన్ లలో అత్యంత భారీ స్థాయిలో పారితోషికాన్ని తీసుకుంటూ క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాథమ్` నుంచి స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న ముట్టబొమ్మ ఆ తరువాత వరుస క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. 2018 నుంచి ఏడాది రెండు భారీ ప్రాజెక్ట్ లలో స్టార్ హీరోలతో నటిస్తూ ఇండస్ట్రలో హాట్ టాపిక్ గా మారింది.బన్నీ - త్రివిక్రమ్ ల కలయికలో వచ్చిన `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో టాలీవుడ్ లో అత్యంత క్రేజీ హీరోయిన్ గా మారిపోయి బుట్టబొమ్మ అనిపించుకుంది. అయితే రాధేశ్యామ్ బీస్ట్ ఆచార్య పరాజయాలతో కాస్త రేసులో వెనకబడినా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం హిందీలో రణ్ వీర్ తో `సర్కస్` సల్మాన్ ఖాన్ తో `కిసీకా భాయ్ కిసీకా జాన్` వంటి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది.

ఇదే సమయంలో తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB28లో నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతన్న ఈ భారీ యాక్షన్ డ్రామా రెగ్యలర్ షూటింగ్ ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్స్ అన్బు అరివు ల నేతృత్వంలో మహేష్ కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లని రూపొందించారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా పాల్గొనబోతోంది. తెలుగులో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాడం పూజా హెగ్డేకు చాలా అవసరం. దవీంతో ఈ మూవీపై తను ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. ఇదిలా వుంటే పూజా హెగ్డే కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని ఆ కారణంగానే తను లండన్ వెళ్లిందని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. నోస్ తో పాటు లిప్స్ కి పూజా హెగ్డే సర్జరీ చేయించుకుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రాచారంపై ఆమె టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తను ఆగస్టులో వెకేషన్ కి వెళ్లి వచ్చిందని తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని అవన్నీ బేస్ లెస్ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే హైదరాబాద్ లోనే వున్నారట. మహేష్ త్రివిక్రమ్ ల మూవీ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తోందట. అక్టోబర్ రెండవ వారంలో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.