Begin typing your search above and press return to search.

యువ హీరోయిన్ తో అమ‌ర్యాదగా ప్ర‌వ‌ర్తించారు

By:  Tupaki Desk   |   26 Jan 2022 2:30 PM GMT
యువ హీరోయిన్ తో అమ‌ర్యాదగా ప్ర‌వ‌ర్తించారు
X
యంగ్ హీరోయిన్ ప్రియాప్ర‌కాష్ వారియ‌ర్ ఒకే ఒక్క వింక్ (క‌న్నుగీటు)తో ఎంతగా ఫేమ‌స్ అయిందో తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులేర్ప‌డ్డారు. అటుపై టాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకుని ప్ర‌తిభ నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ప్రియా ప్ర‌కాష్‌ కెరీర్ ఆశించిన విధంగా సాగ‌లేదు. దీంతో సొంత భాష‌కే ప‌రిమిత‌మైంది. తాజాగా ప్రియా వారియ‌ర్ కి ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ఈ విష‌యాన్ని బ్యూటీ ఇన్ స్టా స్టోరీస్ లో రివీల్ చేసింది. ప్రియావారియ‌ర్ పెర్నో గోరెగావ్ హోట‌ల్ లో దిగింది. ఆ హోట‌ల్ లో బ‌య‌ట తినుబండారాలు లోప‌లికి అనుమ‌తిలేదు. ఎలాంటి ఫుడ్ తినాల‌న్నా లోప‌ల కొనుగోలు చేసిన‌వి తినాల్సిందే. ఇది హోట‌ల్ రూల్.

అయితే ఈ సంగ‌తి తెలియ‌ని ప్రియా బ‌య‌ట నుంచి హోట‌ల్ లోప‌లికి ఫుడ్ తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో సిబ్బంది లోప‌లికి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకున్నారు. పుడ్ బ‌య‌టే వ‌దిలేసి లోప‌లికి వెళ్లాల‌ని కోరారు. అయినా ఫుడ్ పారేయ‌డం ఇష్టం లేక వారిని అనుమ‌తివ్వ‌మ‌ని వేడుకుంది. అయినా ఒప్పుకోలేదు. దీంతో ఆక‌లి విలువ తెలిసిన ప్రియా గ‌డ్డ‌క‌ట్టే చలిలోనే ఆ ఫుడ్ ని తినేసి లోప‌లికి వెళ్లింది. హోట‌ల్ సిబ్బంది అమార్య‌ద‌గానూ ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ప్రియా వారియ‌ర్ తెలిపింది. మొత్తానికి అక్క‌డ పెద్ద‌ సీన్ జ‌రిగింద‌ని అర్థ‌మ‌వుతోంది. సాధార‌ణంగా ఫుడ్ విలువ తెలియ‌నివారు ప్రెస్టేజ్ కి పోయి ఫుడ్ ని బ‌య‌ట వ‌దిలేస్తారు.

లోప‌ల ఇంకా ఖ‌రీదైన రుచిర‌క‌ర‌మైన భోజ‌నం దొరుకుతున్న‌పుడు ఇబ్బందేమిటీ! కానీ ప్రియా అలా చేయ‌కుండా ఆక‌లి విలువ‌.. ఆహారం విలువ తెలుసుకుని హుందాగా న‌డుచుకుంది. నిజానికి ప్రియా వారియ‌ర్ షూటింగ్ లో భాగంగా ఆ హోట‌ల్ లో బ‌స చేసింది. త‌న‌కి రూపాయి ఖ‌ర్చు లేకుండా అన్ని ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఏర్పాటు చేసింది. కానీ విలువ‌లు తెలిసిన న‌టి కాబ‌ట్టి హుందాగా న‌డుచుకుంది. ఇక‌ పౌష్టికాహ‌ర లోపం కార‌ణంగా రోజూ ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక‌లితో అల‌మ‌టించే వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో సేవా సంస్థ‌లు...ఎన్ జీవీలో రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నా స‌హాయం కొంత వ‌ర‌కే అందుతోంది.