Begin typing your search above and press return to search.

'ఇండస్ట్రీలో హీరోలు కూడా పెళ్లంటూ వెంటపడ్డారు' అంటున్న సంచలన హీరోయిన్!!

By:  Tupaki Desk   |   11 July 2020 11:30 PM GMT
ఇండస్ట్రీలో హీరోలు కూడా పెళ్లంటూ వెంటపడ్డారు అంటున్న సంచలన హీరోయిన్!!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా ఫ్యాషన్ డిజైనర్ ప్రొఫెషన్ లో ఉన్న శ్రీ రాపాక. ఒక్కసారిగా నగ్నం అనే బోల్డ్ మూవీతో హీరోయిన్ అయిపోయింది. నగ్నం సినిమాలో శ్రీ అందాలన్నీ పోగేసి ఒక బోల్డ్ షార్ట్ మూవీని సినీప్రియులకు అందించాడు రాంగోపాల్ వర్మ. ఆ మూవీ ఎప్పుడైతే విడుదల అయిందో అప్పటి నుండి శ్రీ అలియాస్ స్వీటీ.. తెగ ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. అంతేగాక ఎన్నో సంచలన విషయాలు బయట పెట్టింది. ఇండస్ట్రీ విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. ఇక ఇంత అందం పెట్టుకొని ఇండస్ట్రీ నుండి లవ్ గాని మ్యారేజ్ ప్రపోజల్స్ రాలేదా అంటే అసలు విషయాలు చెప్పుకొచ్చింది అమ్మడు. ఈ బ్యూటీకి స్కూల్ టైంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందట. ప్రపోజల్స్ అనేవి నాకు కొత్తేమి కాదు. స్కూల్లో నా థైస్ మీద పుట్టుమచ్చ చూసి పడిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా నా పెదవులకు.. నా కళ్లకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక స్కూల్లో నన్ను సమంత.. మాధవి లాంటి హీరోయిన్లతో పోల్చేవారు. అంతేకాదు నాకు ఇండస్ట్రీలో చాలామంది నాకు ప్రపోజ్ చేశారు. అందులో డైరెక్టర్స్ కూడా ఉన్నారని అంటోంది ఈ గుమ్మా. నిజానికి డైరెక్టర్లు నన్ను సెక్సీ.. హాట్ అనే పదాలతో పిలిచేవారు. వారు అలా పిలవడాన్ని నేను కంప్లిమెంట్ గా ఫీలవుతా.. అంత అందంగా ఉన్నానని తెలుసంటుంది స్వీటీ. నిజానికి ఫ్యాషన్ డిజైనర్ గా చేసేటప్పుడు ఇన్నేళ్ళుగా డైరెక్టర్లు.. హీరోలు పెళ్లి ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. వాళ్ల పేర్లు చెప్పడం నాకిష్టం లేదంటూ టాపిక్ దాటేసింది. ఇక నా ఫ్రెండ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. నా ఫిజిక్ చూసి చాలా జెలసీగా ఫీలయ్యేవారని చెప్పుకొచ్చింది. ఇక చివరిగా తనకు షాహిద్ కపూర్ లాంటి భర్త కావాలని అంటూనే.. ప్రభాస్ బాగుంటాడని తన మనసులో మాట బయట పెట్టేసింది. ప్రస్తుతం అమ్మడి ఇంటర్వ్యూలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.