హీరోయిన్ రహస్య వివాహం

Tue Jun 25 2019 17:37:44 GMT+0530 (IST)

Heroine Secret Marriage

మోడల్ గా.. హీరోయిన్ గా ఇండియన్ బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన ముద్దుగుమ్మ ఆర్తి చాబ్రియా. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు నటించింది. మొత్తం 25 సినిమాలకు పైగా నటించిన ఆర్తి చాబ్రియా తెలుగులో 'చింతకాయల రవి' చిత్రంలో ఐటెం సాంగ్ చేయడంతో పాటు ఒకరికి ఒకరు.. ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి.. గోపీ గోడమీద పిల్లి చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది. తమిళం మరియు హిందీల్లో కూడా ఆర్తి చాబ్రియా నటించింది.36 ఏళ్ల ఆర్తి చాబ్రియా నిన్న పెళ్లి పీఠలు ఎక్కింది. సుదీర్ఘ కాలంగా ఈమె విశరద్ బీడసేనతో ప్రేమలో ఉందట. ఇరు కుటుంబాల ఒప్పందంతో ఇద్దరు కూడా కొన్ని నెలల క్రితమే వివాహ నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లి ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సమయంలో హఠాత్తుగా ఆర్తి తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ తో పంచుకుంది. పెళ్లికి ముందు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

పెళ్లి హడావుడి లేకుండా సింపుల్ గా జరగాలనే ఉద్దేశ్యంతోనే ముందస్తు సమాచారం మీడియాకు కాని.. అభిమానులకు కాని ఇవ్వలేదని తెలుస్తోంది. పెళ్లి తేదీని రహస్యంగా ఉంచి పెళ్లి అయ్యే వరకు సస్పెన్స్ ను కొనసాగించి పెళ్లి జరిగిన తర్వాత ఫొటోలను విడుదల చేసింది. బుల్లి తెరపై దాదాపు 300 కమర్షియల్స్ కు పైగా నటించిన ఈ అమ్మడు నటనకు గుడ్ బై చెప్పి సంసార జీవితంతో సెటిల్ అవ్వాలనుకుంటుందట. ఆర్తి వివాహం చేసుకున్న వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ అని.. అంతర్జాతీయ స్థాయిలో ట్యాక్స్ కన్సటెన్సీని రన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా నుండి తన పనులు చక్కబెడుతున్న విశరద్ పెళ్లి తర్వాత ముంబయికి షిప్ట్ అవ్వబోతున్నాడట.