బతికి ఉండగానే నా శ్రద్ధాంజలి ఫొటో నేను చూసుకున్నా

Thu Feb 20 2020 09:42:03 GMT+0530 (IST)

Heroine Rekha Emotional Words

తెలుగు ప్రేక్షకులకు ఆనందం చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రేఖ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను దక్కించుకోవడంతో పాటు గుర్తింపును దక్కించుకుంది. అయితే ఈమెకు అదృష్టం కలిసి రాలేదు. ఆనందం చిత్రం తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా అవి నిరాశ పర్చాయి. మెల్ల మెల్లగా ఈమెకు ఆఫర్లే లేకుండా పోయాయి. గత కొంత కాలంగా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటుంది. మళ్లీ ఛాన్స్ వస్తే నటించేందుకు సిద్దంగా ఉన్న రేఖ తాజాగా అలీ టాక్ షో లో పాల్గొంది.వచ్చే వారంలో ప్రసారం కాబోతున్న ఈ టాక్ షోలో రేఖ పలు విషయాలను చెప్పినట్లుగా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. రేఖతో అలీ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగిందనిపిస్తుంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు సన్నగా ఉన్న రేఖ ఇప్పుడు కాస్త బొద్దుగా అయ్యింది. బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రేఖ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.

గతంలో ఒకసారి రేఖ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అప్పుడు ఏకంగా శ్రద్ధాంజలి అంటూ ఫొటోలు పెట్టి దండలు కూడా వేశారు. ఆ విషయంపై స్పందిస్తూ ఆ అదృష్టం నాకు దక్కింది. బతికి ఉండగానే శ్రద్దాంజలి ఫొటోలు చూసుకునే అవకాశం ఎవరికి దక్కుతుంది చెప్పండి. అది నాకు దక్కిందంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇక నాగార్జున గారిపై అభిమానంతో మన్మధుడు చిత్రంలో చిన్న పాత్రను చేశాను.

ఆ సినిమా సమయంలో నాగార్జున గారు నాకు ఒక ఆఫర్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆయన నుండి కాల్ రాలేదు. ఇంకా కూడా ఆయన కాల్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. పూర్తి ఇంటర్వ్యూ లో మరెన్ని విషయాలను ఈ అమ్మడు షేర్ చేసుకుందో చూడాలి.