Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఇడియట్‌ సుచినే ఇలా అయ్యింది

By:  Tupaki Desk   |   20 Feb 2020 5:22 AM GMT
ఫొటోటాక్‌ : ఇడియట్‌ సుచినే ఇలా అయ్యింది
X
తెలుగులో ‘ఇడియట్‌’.. ‘నిజం’ చిత్రాలతో పాటు ఇంకా పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ రక్షిత. ఈ అమ్మడు సినిమాల్లో ఆఫర్లు ఉన్నంత కాలం బిజీ బిజీగా చేసింది. ఎప్పుడైతే కెరీర్‌ కాస్త జోరు తగ్గిందో ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ప్రస్తుతం లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తుంది. పెళ్లి తర్వాత ఫిజిక్‌ పై దృష్టి పెట్టలేదేమో కాస్త లావు అయ్యింది. ప్రస్తుతం ఆమెను చూస్తే ఈమె నిజంగా ఇడియట్‌ సుచినేనా అన్నట్లుగా అనుమానం వ్యక్తం చేయక మానరు.

మామూలుగా అయితే హీరోయిన్స్‌ అవకాశాలు ఉన్నా లేకున్నా వర్కౌట్స్‌ చేస్తూ ఫిజిక్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కాని రక్షిత మాత్రం లావు పెరిగింది. ఆమె అనారోగ్యం కారణం వల్ల అంతగా బరువు పెరిగిందేమో అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా వ్యాలెంటైన్స్‌ డే సందర్బం గా జరిగిన ఒక కార్యక్రమం లో ఈ మాజీ హీరోయిన్‌ కనిపించింది. అక్కడ ఈమెను చూసిన వారు చాలా మంది అవాక్కవుతున్నారు. ఆమద్య లావు అయినట్లుగా మనం చూశాం. కాని ఇప్పుడు ఇంకాస్త లావు అయ్యింది.

2007వ సంవత్సరంలో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ ను వివాహం చేసుకున్న రక్షిత ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది. అయితే బుల్లి తెరపై మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తుంది. తాజాగా కూడా ఒక బుల్లి తెర షో కోసం ఈ అమ్మడు మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఈమె బరువు గురించి చర్చ మొదలైంది.