Begin typing your search above and press return to search.

వివాదంలో హీరోయిన్ హన్సిక సినిమా.. హైకోర్టులో దర్శకుడికి చుక్కెదురు!

By:  Tupaki Desk   |   17 Jun 2021 9:34 AM GMT
వివాదంలో హీరోయిన్ హన్సిక సినిమా.. హైకోర్టులో దర్శకుడికి చుక్కెదురు!
X
దక్షిణాది ఆపిల్ బ్యూటీ హన్సిక.. తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం. కొంతకాలంగా అమ్మడి పేరు వినిపించక ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అలాగే వయ్యారి సినిమాలలో కనిపించి కూడా దాదాపు రెండేళ్లు దాటింది. సందీప్ కిషన్ సరసన 'తెనాలి రామకృష్ణ' అనే సినిమాలో చివరిసారిగా మెరిసింది. అప్పటినుండి ఏ తెలుగు సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. అయితే ప్రస్తుతం హన్సికకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయని చెప్పాలి. సినిమాల గురించి పక్కనపెడితే హన్సిక డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై తన సత్తా చాటుతోంది. ఇటీవలే హన్సిక నటించిన రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ యూట్యూబ్ వేదికగా సంచలనం సృష్టించాయి.

ఈ మ్యూజిక్ వీడియోస్ హన్సికను మళ్లీ ఫామ్ లోకి తీసుకొస్తాయనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఎలాంటి లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం హన్సిక హీరోయిన్ సెంట్రిక్ మూవీ 'మహా'లో నటిస్తుంది. జమీల్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హర్రర్ అంశాలు ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. ఈ సినిమా దర్శకనిర్మాతలు మహా చిత్రం నుంచి ఒక్కొక్కటిగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా కూడా వివాదంలో చిక్కుకుని హైకోర్ట్ వరకు వెళ్ళింది. దర్శకుడు జమీల్ స్వయంగా మహా సినిమా రిలీజ్ ఆపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.

అయితే కోర్టులో డైరెక్టర్ జమీల్ కు చుక్కెదురు అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే తాను నిర్మాతలతో మాట్లాడుకున్న పారితోషికంలో పది లక్షలు పెండింగ్ ఉందని.. అది పూర్తిగా చెల్లించిన తర్వాత సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలని డైరెక్టర్ పిటిషన్ వేసాడు. అయితే డైరెక్టర్ ఆరోపణలను హైకోర్టు న్యాయమూర్తి త్రోసిపుచ్చారు. సినిమా రిలీజ్ విషయంలో పూర్తి హక్కులు నిర్మాత ముత్తలగన్ కే ఉంటాయని తెలిపింది. ఈ విషయంలో రిట్ పిటిషన్ దాఖలు చేయాలనీ చెబుతూ విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.