Begin typing your search above and press return to search.

హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలి.. లేదంటే ఇండస్ట్రీ బతకదు : భారతి రాజా

By:  Tupaki Desk   |   20 Oct 2020 5:15 AM GMT
హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలి.. లేదంటే ఇండస్ట్రీ బతకదు : భారతి రాజా
X
సినిమా షూటింగ్ లు లేక తమిళ చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాలకు సంబంధించిన కళాకారులు, చిన్న చిన్న ఆర్టిస్టులు కష్టాల్లో పడ్డారు. అకస్మాత్తుగా సినిమాలు మధ్యలో ఆగిపోవడంతో నిర్మాతలు నష్టాల్లో కూరుకు పోయారు. కరోనాకు ముందు సినిమా ఇండస్ట్రీ కళకళలాడింది. హీరోహీరోయిన్లు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్​ తీసుకున్నారు. తమ మార్కెట్​ తగ్గట్టు డిమాండ్​ చేశారు. కానీ కరోనా లాక్​డౌన్​తో సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ఈ రంగంమీద ఆధారపడి బతుకుతున్నవాళ్లంతా రోడ్డున పడ్డారు. ఇప్పటికే సినిమా షూటింగ్​ లు పూర్తి చేసుకున్న నిర్మాతలు కష్టాల్లో పడ్డారు. ఓటీటీలో రిలీజ్​ చేయలేక.. థియేటర్లు తెరుచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే అప్పుల బాధ భరించలేక నష్టాలకే సినిమాలను అమ్ముకున్నారు. ఈ క్రమంలో హీరోలు, హీరోయిన్లు, ఆర్టీస్టులు తమ రెమ్యునరేషన్​ తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు. చాలా మంది నిర్మాతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ మేరకు తాజాగా తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు భారతిరాజా కూడా ఓ విజ్ఞప్తి చేశారు.

‘తమిళ సినీరంగం ప్రస్తుతం నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ రంగాన్ని ఆదుకొనేందుకు హీరోలు, హీరోయిన్లు, కళాకారులు, దర్శకులు తమ పారితోషికంలో 30 శాతం తగ్గించుకోవాలి. ఇది కేవలం నా విజ్ఞప్తి మాత్రమే. ఎందుకంటే ఆరునెలలుగా సినిమాలను విడుదల చేయలేక .. నిర్మిస్తున్న సినిమాల షూటింగ్​ ఆగిపోయి పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక నిర్మాతలు కష్టాల్లో కూరుకుపోయారు. అటువంటి నిర్మాతలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆరునెలులుగా షూటింగ్​ లు ఆగిపోయాయి. ఇప్పటికే తెలుగు సినీరంగంలోని హీరో హిరోయిన్లు తమకు తాముగా 30 శాతం పారితోషికం తగ్గించుకున్నారు’ అని తమిళ నటీనటులు కూడా తమ పారితోషికం తగ్గించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.