ఆ సినిమాలో నాతో రొమాన్స్ సీన్స్ చేయటానికి అతను చాలా ఇబ్బంది పడ్డాడు

Mon Aug 15 2022 09:29:20 GMT+0530 (IST)

Hero troubled to do romance scenes with Tejaswi

హుషారుకు.. ఉత్సాహానికి పేరు పెట్టాల్సి వస్తే.. టాలీవుడ్ లో తేజస్వీగా చెప్పేయొచ్చు. గలగల మాట్లాడే ఈ బ్యూటీ తనకొచ్చిన అవకాశాల్ని జాగ్రత్తగా మలుచుకుంటూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళుతోంది. సినీ హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చేస్తూనే.. ఆ ఛాన్సులు సన్నగిల్లినప్పుడు రియాల్టీ షోలు చేయటానికి అస్సలు వెనుకాడని వ్యక్తిగా ఆమెను చెప్పొచ్చు.తాజాగా ఆమె నటించిన చిత్రం 'కమిట్ మెంట్'. ఇండస్ట్రీని కమిట్ మెంట్ పేరుతో బద్నాం చేస్తుంటారని.. ఈ సినిమాలో ఆ ఇష్యూను మరింత డిఫరెంట్ గా చూపించినట్లు చెబుతోంది. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాలో తన పాత్ర గురించి విన్నంతనే ఓకే చేసినట్లు చెప్పింది.

ఒక సినిమాకు ఎంత అవసరం ఉంటుందో అంతే చేయాలని.. బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా.. కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానంటున్న ఈ హుషారు పిల్ల.. తాజాగా తాను చేసిన సినిమాలో రొమాన్స్ ఉంటుందని.. శ్రీనాథ్ తనతో రొమాన్స్ సీన్స్ చేయటానికి చాలా ఇబ్బంది పడినట్లుగా చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో తనను ఎవరూ కమిట్ మెంట్ కోరలేదని.. తనకు అలాంటి పరిస్థితి ఎదురు కాలేదంది. అందరూ తనతో కూల్ గా ఉన్నారని.. తనను కమిట్ మెంట్ అడగాలంటే భయపడేవాళ్లని చెప్పింది.

తనకు చాలానే అవకాశాలు వస్తున్నాయని.. వాటిల్లో చాలావరకు అక్క.. చెల్లి పాత్రలే చెబుతున్నారని.. లేదంటే బోల్డ్ క్యారెక్టర్లు తీసుకొస్తున్నారే తప్పించి.. కేరింతలో మాదిరి పాత్ర మాత్రం రావట్లేదని చెప్పింది. సినిమాలు మానేసి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు చెబుతున్నారని.. అందుకే పెళ్లి చేసుకోవటం మానేసినట్లు చెప్పింది.

బిగ్ బాస్ షోకు వెళ్లటం వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పింది. ఆ షో కారణంగా కారు.. ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉన్నట్లుగా చెప్పింది. బిగ్ బాస్ కారణంగా ఛాన్సులు మిస్ అయ్యాయని ఎవరైనా అంటే తాను లెక్క పెట్టనని చెప్పింది. తను చాలా  స్మార్ట్ అని.. లైఫ్ ని ఎలా రన్ చేయాలో తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చింది. ఏమైనా.. కాలం మారిందన్న దానికి నిదర్శనంగా తేజస్వీ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.