Begin typing your search above and press return to search.

భార్య‌తో క‌ల‌త‌ల కార‌ణంగా క్రేజీ ఫ్రాంఛైజీ నుంచి హీరో ఔట్?

By:  Tupaki Desk   |   17 May 2022 4:10 AM GMT
భార్య‌తో క‌ల‌త‌ల కార‌ణంగా క్రేజీ ఫ్రాంఛైజీ నుంచి హీరో ఔట్?
X
అత‌డి న‌ట‌న స‌మ‌కాలీన తార‌ల‌తో పోలిస్తే ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఎంపిక చేసుకునే పాత్ర‌లు వేష‌ధార‌ణ ప్ర‌తిదీ యూనిక్ అని చెప్పాలి. అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. అవార్డులు రివార్డుల‌కు అయితే కొద‌వే లేదు.

కానీ ఇటీవ‌లి కాలంలో వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల‌త‌లు ఇబ్బంది పెడుతున్నాయి. హాలీవుడ్ నటుడు జానీ డెప్ గురించే ఇదంతా. అత‌డిపై మాజీ భార్య అంబర్ హర్డ్ ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై కోర్టులో విచార‌ణ సాగుతోంది. కోర్టు విచారణ ఆరోపణలు ఇప్ప‌టికే నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంబర్ హర్డ్ చేసిన గృహ హింస ఆరోపణల వల్ల అతనికి చాలా సినిమాల ఆఫర్లు పోయాయి. అత‌డిని ప్ర‌జ‌లు చూస్తున్న కోణం మారిపోయింది.

ది పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ లో అత్యంత పాపుల‌ర్ క్యారెక్టర్ కెప్టెన్ జాక్ స్పారో ఇకపై జానీ డెప్ పోషించడం లేద‌నేది తాజాగా అందిన‌ సమాచారం. ది పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నిర్మాత జెర్రీ బ్రూక్ హైమర్ క‌థానాయ‌కుడి మార్పుతో ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు ధృవీకరించారు.

వ‌రుస‌గా రెండు పైరేట్స్ స్క్రిప్ట్ లపై పనిచేస్తున్నామ‌ని ధృవీకరించారు. ఒకటి మార్గోట్ రాబీతో చేస్తారు. మ‌రొక‌టి అత‌డు లేకుండా కూడా ఉంటుంది. జాక్ స్పారో తిరిగి వస్తారా అని ప్ర‌శ్నించ‌గా..ఈ సమయంలో కాదు. భవిష్యత్తు ఇంకా నిర్ణయించలేదు! అని న‌ర్మ‌గ‌ర్భంగా నిర్మాతలు జ‌వాబిచ్చారు.

జానీ డెప్ - అంబర్ హర్డ్ పరువు నష్టం విచారణల సమయంలో ఈ ప్ర‌క‌ట‌న డెప్ అభిమానుల‌కు షాకింగ్ అని చెప్పాలి. అయితే జానీ డెప్ కాకుండా కొత్త న‌టుల‌తో ఆ పాత్ర‌ను ఎలా ఫుల్ ఫిల్ చేస్తార‌న్నది వేచి చూడాలి. జానీ డెప్ ని త‌ప్ప ఇంకెవ‌రినైనా ప్ర‌జ‌లు ఊహించ‌గ‌ల‌రా? అన్న‌ది కూడా ఇప్ప‌టికి స‌స్పెన్స్.

అయితే అభిమానులు జాక్ స్పారో పాత్రను ఇంకా కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నారు. జానీ డెప్ ను తిరిగి తీసుకు వ‌స్తేనే సినిమా ఆడుతుంద‌ని చాలా మంది సోషల్ మీడియాలో బహిరంగంగా కోరుతున్నారు. అయితే త‌న‌ను ఇంకా ఈ మూవీ నుంచి తొల‌గించ‌లేద‌ని న‌మ్ముతున్న‌ట్టు జానీ డెప్ నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.