Begin typing your search above and press return to search.

బడా ప్రొడ్యూసర్ పై హీరో విశాల్ ఫిర్యాదు.. చెలరేగుతున్న డాకుమెంట్స్ వివాదం!

By:  Tupaki Desk   |   9 Jun 2021 4:30 PM GMT
బడా ప్రొడ్యూసర్ పై హీరో విశాల్ ఫిర్యాదు.. చెలరేగుతున్న డాకుమెంట్స్ వివాదం!
X
సౌత్ సినీహీరో విశాల్ తాజాగా మరో వివాదంతో వార్తల్లో నిలిచాడు. కాకపోతే ఈసారి ఓ ప్రముఖ నిర్మాత పై పోలీస్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపాడు. 2018లో విశాల్ ప్రధానపాత్రలో నటించిన 'ఇరుంబు తురై'(తెలుగులో అభిమన్యుడు) మూవీ ఆర్థిక వివాదం విషయంలో విశాల్ కేసు వరకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆర్థిక వివాదంపై విశాల్.. ప్రముఖ నిర్మాత ఆర్‌బి చౌదరిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాను 2018లో ఇరుంబు తిరాయ్ సినిమా కోసం అప్పు తీసుకునే ముందు సమర్పించిన డాకుమెంట్స్ తిరిగి ఇవ్వడంలో మాట మార్చేసారని విశాల్ ఆరోపించాడు.

ఈ విధంగా ట్విట్టర్ వేదికగా కంప్లైంట్ చేసినట్లు పోస్ట్ చేసాడు. ట్విట్టర్ వేదికగా.. "మిస్టర్ ఆర్బిచౌదరి గారు.. ఇరుంబుతిరై సినిమాకోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించి కొన్ని నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు సినిమాకు ముందు రాసుకున్న చెక్ లీవ్స్ - బాండ్స్ - ప్రామిసరీ నోట్స్ తిరిగి ఇవ్వకపోవడం తాను అంగీకరించట్లేదని.. అలాగే ఇప్పుడు డాకుమెంట్స్ అడిగితే ఎక్కడ పెట్టానో కనిపించడం లేదని సాకులు చెప్పి తప్పించుకున్నట్లుగా.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్వీట్ లో తెలిపాడు. కాబట్టి నాలుగు నెలలకు పైగా పత్రాలను తిరిగి ఇవ్వాలని అడుగుతున్నా ఇవ్వలేదని విశాల్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం విశాల్ ట్వీట్ కారణంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో.. వివాదం చెలరేగుతోంది. ప్రస్తుతం ఇరుంబు తిరై సినిమాకు సంబంధించిన ఈ ఇష్యూ చర్చనీయంశంగా మారింది. అయితే పిఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించిన ఇరుంబు తిరాయ్ సినిమాలో అర్జున్ సర్జా - సమంతా అక్కినేని ముఖ్యపాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించగా.. లైకా ప్రొడక్షన్స్ పంపిణీ చేసింది. హీరో విశాల్.. నటనతో పాటు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నాడు. తన బ్యానర్ పై ఇప్పటివరకు పలు సినిమాలు నిర్మించి కొన్ని పంపిణీ చేసాడు. అయితే ఇరుంబు తిరై సినిమా టైంలో ఆర్బి చౌదరి వద్ద అప్పు తీసుకుని తిరిగి చెల్లించినట్లు తెలిపాడు. ఇప్పుడు తను సంతకం చేసిన డాకుమెంట్స్ ఇవ్వకపోవడంతో టి. నగర్ డీసీ కార్యాలయంలో ఫిర్యాదు చేసానని విశాల్ మీడియాకు తెలిపినట్లు సమాచారం.