ఇన్ని సీక్వెల్స్ అవసరమా రాజా ?

Fri Apr 19 2019 07:00:01 GMT+0530 (IST)

Hero Vishal Looking For Abhimanyudu Sequel

నల్లనయ్య విశాల్ కు ఎందుకో ఈ మధ్య సీక్వెల్స్ మీద మోజు పెరిగిపోతోంది. పందెం కోడి 2 యావరేజ్ ఫలితాన్నే దక్కించుకున్నప్పటికి బిసి సెంటర్స్ లో కమర్షియల్ గా వర్క్ అవుట్ కావడం ధైర్యాన్ని ఇచ్చింది కాబోలు. ఇప్పుడు వరుసబెట్టి అలాంటి ఆలోచనలే చేస్తున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. గత ఏడాది మిత్రన్ దర్శకత్వంలో సమంతా హీరోయిన్ గా విశాల్ చేసిన అభిమన్యుడు ఘన విజయం సాధించింది. దానికి కొనసాగింపు కోసం విశాల్ ట్రై చేస్తున్నట్టు తెలిసింది.అయితే మిత్రన్ ఇతర కమిట్ మెంట్స్ లో బిజీగా ఉండటంతో దర్శకుడు ఆనంద్ తో తీసే ప్లాన్ లో ఉన్నాడట. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని వినికిడి. ఇదిలా ఉండగా రెండు భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డిటెక్టివ్ కి సీక్వెల్ కోసం మిస్కిన్ ఇప్పటికే లైన్ రెడీ చేసినట్టుగా చెన్నై టాక్. ఈ కథ అంటే ప్రత్యేకమైన ఇంటరెస్ట్ ఉన్న విశాల్ కథ ఫైనల్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడట

విశాల్ కెరీర్ మొత్తం మీద గట్టిగా హిట్ అని చెప్పుకునే సినిమాలకు ఇలా వరసగా సీక్వెల్స్ ప్లాన్ చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. టెంపర్ రీమేక్ అయోగ్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఎలాగూ ఇక్కడ ఆడిన సినిమా కాబట్టి విశాల్ దాన్ని డబ్బింగ్ చేసే ఆలోచనలో లేడు. పోలిక వస్తే తనే తేలిపోతాడు కాబట్టి అది మంచి నిర్ణయమే.

ఎంత కథల కరువు ఉన్నా ఇలా సీక్వెల్స్ గురించి ఇన్నేసి ఆలోచనలు చేయడం ఏమిటో విశాల్ కే తెలియాలి. సౌత్ లో బాహుబలి లాంటి ఒకటి ఆరా తప్ప సీక్వెల్స్ వర్క్ అవుట్ అయిన చరిత్ర పెద్దగా లేదు. అయినా విశాల్ సాహసం చేసేందుకు రెడీ కావడం చూస్తుంటే ఏంటో ఆ ధైర్యం అని అనిపించక మానదు.