Begin typing your search above and press return to search.

మాస్ చిత్రాలకు బ్రేక్ ఇవ్వనున్న రామ్..?

By:  Tupaki Desk   |   31 March 2020 9:30 PM GMT
మాస్ చిత్రాలకు బ్రేక్ ఇవ్వనున్న రామ్..?
X
'దేవదాస్' సినిమాతో సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు రామ్ పోతినేని. ఫస్ట్ సినిమాతోనే ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్నాడు. అప్పటి నుండి వరుస సినిమాలతో దూసుకుపోతూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రెడీ - మస్కా - కందిరీగ - పండగ చేస్కో సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ శంకర్' చిత్రంతో తన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్ గెట్ అప్ కి వచ్చన రెస్పాన్స్ బాక్సీఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇదే ఊపులో రామ్ తన నెక్స్ట్ సినిమాగా 'రెడ్'ను పట్టాలెక్కించాడు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వారి కలయికలో వచ్చే మూడో సినిమా. రామ్ ఈ చిత్రంలో కూడా మాస్ లుక్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే రామ్ తన తదుపరి చిత్రంలో తన పాత్రను పూర్తిగా చేంజ్ చేయాలని భవిస్తున్నాడట. రెడీ సినిమా లాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ముందుకు రావాలనుకుంటున్నాడు. రామ్ తన తదుపరి చిత్రానికి మారుతికి డైరెక్టర్ గా ఫైనలైజ్ చేసిన విషయం తెలిసిందే. రామ్ తో ఒక మాస్ మూవీ తీయాలనే ఆలోచనతో ఉన్న మారుతి - రామ్ సూచన మేరకు ఇప్పుడు కుటుంబ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. 'ప్రతిరోజూ పండగే' చిత్ర విజయంతో మంచి ఊపు మీదున్న మారుతి మళ్ళీ అలాంటి కథనే రామ్ కోసం రెడీ చేస్తున్నాడట. రామ్ నిర్ణయం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూడాలి.