Begin typing your search above and press return to search.

గుడిలో భీష్ముడి విజయానందం

By:  Tupaki Desk   |   22 Feb 2020 4:20 AM GMT
గుడిలో భీష్ముడి విజయానందం
X
నితిన్‌.. రష్మిక జంటగా తెరకెక్కిన భీష్మ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఛలో తో సక్సెస్‌ ను దక్కించుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నితిన్‌ చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చేశాడు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది టైం తీసుకున్నా కూడా మంచి సినిమాతో వచ్చాడంటూ రివ్యూవర్స్‌ కూడా రివ్యూలు ఇస్తున్నారు. ఈ ఆనందంను నితిన్‌ శ్రీకాళహస్తి స్వామివారి దేవాయంలో స్నేహితులతో పంచుకున్నారు.

మహాశివరాత్రి మరియు తన సినిమా విడుదల కారణంగా తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నితిన్‌ ఆ తర్వాత శ్రీకాళహస్తి వెళ్లాడు. అక్కడ థియేటర్‌ లో ప్రేక్షకులతో కలిసి సినిమాను చూశాడు. ఆ సమయంలో నితిన్‌ స్నేహితులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఉన్నారు. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం చూసి ఆనందం వ్యక్తం చేశాడు.

సినిమా తర్వాత శ్రీకాళ హస్తి దేవాలయంకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నితిన్‌ మాట్లాడుతూ భీష్మను ఇంతటి సక్సెస్‌ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు. ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్‌ జోష్‌ తో తదుపరి చిత్రాన్ని సమ్మర్‌ లో విడుదల చేయబోతున్నాడు. ప్రస్తుతం నితిన్‌ రెండు సినిమాలను బ్యాక్‌ టు బ్యాక్‌ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరో వైపు హిందీ సినిమా రీమేక్‌ కు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. ఈ ఏడాది మూడు లేదా నాలుగు సినిమాలను నితిన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.