నవీన్ పొలిశెట్టి రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా!

Tue Aug 03 2021 20:00:01 GMT+0530 (IST)

Naveen Polisetty is not a real hero but a real hero

కరోనా రూపంలో మునుపెన్నడూ చూడనటువంటి మహమ్మారి ని ఈ ప్రపంచం ఎదురుకుంటోంది. మన భారత దేశంలోనే చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ కరోనా కాలంలో ఎంతో మందికి సహాయం చేసిన నవీన్ పోలిశెట్టి ఒక వ్యక్తికి ఉద్యోగం పొందడంలో సహాయం చేశారు.నవీన్ చేసిన ట్వీట్ కి స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్ అనే యువకుడికి స్టోర్ మేనేజర్‌గా ఉద్యోగం కల్పించింది. సమీర్ కి ఉద్యోగం లభించిన విషయాన్ని ట్వీట్ చేస్తూ నవీన్ తన సంతోషాన్ని తెలియచేశారు. ఈ వోక్ సంస్థ కి వచ్చి సిబ్బందిని కలుస్తానని అన్నాడు. ఈ కష్ట సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి తమ వంతు సహాయం చేయాలని అందరినీ నవీన్ కోరాడు.

ఇక తనకి సమీర్ గురించిన సమాచారం అందించిన ఇద్దరు నెటిజన్లకి ధన్యవాదాలు చెప్పారు. జాతిరత్నాలు చిత్రం తో కరీర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కొట్టిన నవీన్ జేజమ్మ అనుష్క తో ఒక చిత్రంలో నటించబతున్నారు అని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.