Begin typing your search above and press return to search.

మెగాస్టార్ క‌న్నీళ్లు.. అస‌లేమైంది?

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:32 AM GMT
మెగాస్టార్ క‌న్నీళ్లు.. అస‌లేమైంది?
X
సెల‌బ్రిటీల ఎమోష‌న‌ల్ మూవ్ మెట్స్ రేర్ గా బ‌య‌ట‌ప‌డ‌తాయి. ప‌బ్లిక్ వేదిక‌ల‌పై ...అవార్డు వేడుక‌ల్లో ఇలాంటి మూవ్ మెంట్స్ ను చూస్తుంటాం. ఆపుకోలేని భావోద్వేగంతో అభిమానులకు షాకిచ్చేస్తుంటారు. తాజాగా ఇలాంటి స‌న్నివేశ‌మే ఒక‌టి ఇటీవ‌ల ఓ ఈవెంట్లో చోటు చేసుకుంది. రీసెంట్ గా ఓ ప్ర‌యివేటు చానెల్ అవార్డు వేడుక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. చిరుకి ఘ‌న‌మైన స్వాగ‌తం ల‌భించింది. బాస్ ఎంట్రీతో అక్క‌డ వాతావావ‌ర‌ణం ఒక్క‌సారిగా వెడెక్కింది. చిరుకి ట్రిబ్యూట్ గా.. మెగా చార్ట్ బ‌స్టర్స్ అయిన పాట‌ల‌కు డ్యాన్సులు చేస్తూ మెగాస్టార్ కు గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్పారు యువ‌హీరో కార్తికేయ‌. చిరుపై అభిమానంతో ప్రేమ‌తో యంగ్ హీరో కార్తికేయ చిరు పాత సూప‌ర్ హిట్టు పాట‌ల‌కు డాన్సులు చేసి మైమ‌రిపించాడు. మెగా ఫ్యాన్స్ అత‌డి డ్యాన్సుల‌కు క్లాప్స్ కొట్టారు.

అదే సంద‌ర్భంలో 27 ఏళ్ల‌గా మీ అభిమానిని స‌ర్. చ‌ర‌ణ్ ఒక్క‌డే కాదు...మేమంతా మీ బిడ్డ‌ల‌మే అంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. దీంతో చిరంజీవి సైతం ఎంతో భావోద్వేగానికి గుర‌య్యారు. ఆ క్ష‌ణం మెగాస్టార్ కంట క‌న్నీళ్లు ఉబికి వ‌చ్చాయి. ఆ వెంట‌నే కార్తికేయ వేదిక‌ పై నుంచి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి చిరంజీవి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించాడు. దీంతో చిరంజీవి మ‌రింత ఎమోష‌న‌ల్ అయ్యారు. చిరు కార్తికేయ‌ను ఆశీర్వ‌దించి ఆప్యాయంగా హ‌త్తుకున్నారు. ఈ అవార్డు వేడుక‌ల కార్య‌క్ర‌మంలో ఇదే బెస్ట్ ఎమోష‌న‌ల్ సీన్. మొత్తం ఈవెంట్ కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన స‌న్నివేశం అది. ఈ స‌న్నివేశంతో అక్క‌డ వాతావ‌ర‌ణం ఒక్క సారిగా సైలెట్ అయిపోయింది.

ఆ స‌న్నివేశానికి సంబంధించిన ఓ ప్రోమో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. అలా చిరు హృద‌యానికి యంగ్ హీరో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. కార్తికేయ ఆర్.ఎక్స్ 100 సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు... అందులో న‌టీన‌టుల‌కు అంద‌రికీ మంచి పేరు వ‌చ్చింది. ఆ విజ‌యంతో కార్తికేయ మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటున్నాడు. స్టార్ స్ట‌డ్ నేప‌థ్యం లేక‌ పోయినా ట్యాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదుగుతున్న కుర్రాడిగా కార్తికేయ‌ కు గుర్తింపు ద‌క్కింది.