Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కు మరో హీరో బర్త్‌ డే గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   20 May 2020 7:20 PM GMT
ఎన్టీఆర్‌ కు మరో హీరో బర్త్‌ డే గిఫ్ట్‌
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా సోషల్‌ మీడియాలో ఆయన అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. కేవలం 24 గంటల్లో రెండు కోట్లకు పైగా హ్యాపీబర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్వీట్స్‌ చేసి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా ఆయన అభిమానులుగా చెప్పుకునే యంగ్‌ హీరోలు కూడా ప్రత్యేకంగా వీడియోలు పోస్ట్‌ చేసి సోషల్‌ మీడియాలో సందడి చేశారు.

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ఈ సందర్బంగా స్వయంగా పాడిన ఒక రాప్‌ సాంగ్‌ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఆ పాట నెట్టింట వైరల్‌ అయ్యింది. నందమూరి అభిమానులకు ఆ పాట తెగ ఎక్కేసింది. విశ్వక్‌ సేన్‌ పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మరో యంగ్‌ హీరో కార్తికేయ కూడా ఎన్టీఆర్‌ బర్త్‌ డే కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేసి నందమూరి ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించాడు.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర హీరో కార్తికేయ ట్విట్టర్‌ లో.. ఎన్టీఆర్‌ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ మన కారనజన్ముడు అంటూ నాన్నకు ప్రేమతో సినిమాలోని ఐ వాన ఫాలో ఫాలో యు అనే పాటకు ఎన్టీఆర్‌ మాదిరిగా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఆమద్య మెగాస్టార్‌ను ఆకాశానికి ఎత్తిన ఈ హీరో ఇప్పుడు ఎన్టీఆర్‌ ను కారన జన్ముడు అంటూ మాట్లాడటంతో అటు మెగా ఫ్యాన్స్‌ ఇటు నందమూరి ఫ్యాన్స్‌ కూడా ఫిదా అవుతున్నారు.