స్టార్ హీరో అజ్ఞానాన్ని ధైర్యంగా ప్రశ్నించిన నటి

Tue Jul 07 2020 12:00:56 GMT+0530 (IST)

Hero Forgets To Tag Heroine Trolls Him

యువహీరో సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం ఎన్నో కొత్త సంగతుల్ని బయటపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ మాఫియా లోతుపాతుల్ని బయటి ప్రపంచానికి బహిర్గతం చేసింది. నటవారసత్వం (నెప్టోయిజం) ప్రముఖంగా కార్నర్ అయ్యింది. కపూర్ లు .. ఖాన్ లు.. బచ్చన్ లు.. భట్స్ ఆడే అండర్ ప్లే గేమ్స్ ని బయటపడేలా చేసింది ఈ ఎపిసోడ్. ఇప్పటికీ సుశాంత్ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయాలని సీబీఐని అభ్యర్థిస్తున్నారు ఫ్యాన్స్. ఇదంతా చూస్తుంటే అక్కడ బయటి ప్రపంచానికి తెలీని ఎన్నో చీకటి కోణాలు తెలుసుకోవాల్సిన తరుణం వచ్చిందని అందరికీ అర్థమవుతోంది.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఎరక్క పోయి ఇరుక్కు పోయాడు. అతడు నటించిన క్లాసిక్ హిట్ చిత్రం `బోల్ బచ్చన్` రిలీజై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భం గా దేవగన్ స్వయం గా ఆ సినిమా పోస్టర్ ని సోషల్ మీడియాల్లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అందు లో కేవలం బచ్చన్ తో తాను ఉన్న ఫోటో మాత్రమే కనిపిస్తోంది. ఇక ఈ పోస్ట్ లో మరో ఐదుగురు స్టార్లను అజయ్ దేవగన్ విస్మరించాడు. దర్శకుడు రోహిత్ శెట్టి ని ప్రస్థావించినా కనీస మాత్రం గా అయినా కోస్టార్ల గురించి ప్రస్థావించనే లేదు.

దీంతో సీరియస్ అయిన కథానాయిక ప్రాచీ దేశాయ్ నేరు గా ఈ విషయాన్ని పాయింట్ అవుట్ చేసింది. దేవగన్ ని నిలదీసే ప్రయత్నం చేసింది. అతడిని ట్రోల్ చేస్తూ తన వెర్షన్ ని వినిపించింది. అభిషేక్ - అమితాబ్ బచ్చన్ మినహా మిగతా వారందరినీ అజయ్ తన ట్వీట్ లో విస్మరించారని ఆరోపించింది. బోల్ బచ్చన్ లో నటించిన ఇతర స్టార్లు ప్రాచి దేశాయ్- అసిన్ - కృష్ణా- అర్చన పురాన్ సింగ్- అస్రానీ- నీరజ్ వోహ్రా - జీతు వర్మలను దేవగన్ మరచి పోయాడు. దాంతో అతడి ఆజ్ఞానా న్ని ధైర్యం గా ప్రశ్నించింది ప్రాచీ.