పిక్ టాక్ : యాక్షన్ కింగ్.. స్టైలిష్ విలన్ సూపర్ కాంబో

Mon Sep 26 2022 12:32:30 GMT+0530 (India Standard Time)

Hero Arjun Setting Hair of JagapathiBabu

ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించి సూపర్ హిట్స్ దక్కించుకున్న జగపతి బాబు వరుసగా విలన్ వేషాలు వేస్తూ ఉన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా ఆయన నటన ఈ మధ్య కాలంలో మరింత మంది అభిమానులను తెచ్చి పెడుతుంది అనడంలో సందేహం లేదు.ప్రస్తుతం జగపతిబాబు నటిస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దదే. అందులో ఒకటి అర్జున్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

తెలుగు లో తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను పరిచయం చేస్తూ యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది.

ఇటీవల షూటింగ్ సందర్భంగా అర్జున్ స్వయంగా ఒక హెయిర్ డ్రెస్సర్ గా మారి జగపతిబాబు యొక్క జుట్టును సరి చేస్తున్నాడు. తన సినిమాలోని ప్రతి ఒక్క ఎలిమెంట్ విషయంలో అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

ఈ ఫోటోను షేర్ చేసిన జగపతిబాబు.. సండే యాక్షన్ విత్ యాక్షన్ కింగ్ అర్జున్ ఇంకా ఎవరైనా లైన్ లో ఉన్నారా అంటూ ట్వీట్ చేశాడు. అర్జున్ మరియు జగపతిబాబు ల యొక్క స్నేహం ఇప్పటిది కాదు. ఇద్దరు కలిసి హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

అప్పటి నుండే ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూ వస్తోంది. ఇద్దరు పలు సందర్భాల్లో కలిశారు.. కనిపించారు. కానీ చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబోలో సినిమా వస్తుంది. ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అనేది చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.