Begin typing your search above and press return to search.

ఇంత ఇంటెన్స్ పాత్రను ఎందుకు వద్దన్నాడబ్బా?

By:  Tupaki Desk   |   9 April 2020 8:10 AM GMT
ఇంత ఇంటెన్స్ పాత్రను ఎందుకు వద్దన్నాడబ్బా?
X
నిన్న ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయిన సమయం నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ సాగుతోంది 'పుష్ప' పోస్టర్లు అదిరిపోయాయి. అల్లు అర్జున్ మేకోవర్ చిరిగిపోయింది. సుకుమార్ ప్రజెంటేషన్ దుమ్ము రేగిపోయింది. ఇలాంటి వైవిధ్యం ఉన్న పాత్రలు అరుదుగా కానీ స్టార్ హీరోల వద్దకు రావు. మరి ఇలాంటి అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందుకు వదులుకున్నారు?

పోస్టర్ లో చూపించిన ఎర్రచందనం చెక్కలు.. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ అన్నీ చూస్తుంటే ఇది మహేష్ కోసం సుకుమార్ రెడీ చేసిన స్క్రిప్ట్ అనే విషయం ఎవరికైనా చిటికెలో అర్థం అవుతుంది. ఆ కథ వేరు కథ వేరు అని ఎవరైనా కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మేంత అమాయకులు ఎవరూ లేరు. మరి సినిమాను మహేష్ ఎందుకు వదులుకున్నారని సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మొదటిది మహేష్ మేకోవర్ విషయంలో పట్టుదలగా ఉంటారని.. మైనర్ చేంజెస్ తప్ప.. తీవ్రమైన మేకోవర్ కు ఆయన వ్యతిరేకమని అంటున్నారు. నిజానికి ప్రతి సినిమాలో కూడా మహేష్ అందంగా ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. అలాంటిది ఈ సినిమా కోసం డిగ్లామరైజ్డ్ అవతారంలో కనిపించాలి కాబట్టి మహేష్ నో చెప్పి ఉంటారని అంటున్నారు.

రెండవ కారణం.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు మహేష్ పెద్దగా ఆసక్తి చూపించరని.. అందుకే క్యారెక్టరైజేషన్ కొంత మార్చాలని సుకుమార్ ను కోరారని.. అది కుదరకపోవడం తోనే ఈ ప్రాజెక్టును వదులుకున్నారని అంటున్నారు. ఏదేమైనా మహేష్ కు ఒక విభిన్నమైన కథ.. రొటీన్ కు భిన్నంగా ఉండే పాత్ర మిస్ అయ్యాయి అని చెప్పక తప్పదు. మసాలా సినిమాలు ఎన్నైనా చేయవచ్చు కానీ ఇలాంటి విభిన్నమైన సినిమాలు అరుదుగానే వస్తాయి. అందులోనూ 'రంగస్థలం' లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన సుకుమార్ ను మిస్ చేసుకోవడం మహేష్ కు నష్టమేనని కొందరు అంటున్నారు. అది నిజమా కాదా అనేది తెలియాలంటే కాలం వేచి చూడక తప్పదు.