ఇండియన్-2పై ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేడ్ ఇది!

Sat Dec 03 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Here's the latest update that's interesting on Indian 2!

విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ -2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శంకర్ అటు 'ఆర్ సీ 15 షూటింగ్ ని...ఇటు 'ఇండియన్ -2' బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇలాంటి సన్నివేశం ఆయనకు కొత్తే అయినా తప్పడం లేదు. తాజాగా ఇండియన్ 2 కి సంబంధించి కొత్త షెడ్యూల్కి రంగం సిద్దమవుతోంది. చెన్నై విమానశ్రయంలో చిత్రీకరణకు ఏర్పాట్లు  జరుగుతున్నాయి.సేనాపతి విదేశాల నుంచి భారత్ కి తిరిగి వచ్చే సన్నివేశాలు షూట్ చేయనున్నారు. దీనిలో భాగంగా అందుకు తగ్గట్టు టీమ్ అన్నింటిని సన్నద్ధం చేస్తుంది. ఒకే సారి రెండు భాగాలకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ సన్నివేశాలు ఇప్పుడే పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఒకే రకమైన సీన్స్ కి రెండు సార్లు అనుమతులు తీసుకోవడం కన్నా ఒకే అనుమతితో రెండు పనులు పూర్తి చేసి ఎయిర్ పోర్టు లో చిత్రీకరణ కథ ఇక్కడితో ముగించాలని భావించి ఈ రకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 5 నుంచి ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభం నుంది. నాటి నుంచి ఏకధాటిగా షెడ్యూల్ మొత్తం పూర్తయ్యే వరకూ కొనసాగు తుంది. అనంతరం విదేశాల్లో కొన్ని సన్నివేశాలు  చిత్రీకరించాల్సి ఉందిట.  తొలి చిత్రాన్ని  మించి  రెండవ భాగాన్ని భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు. సినిమాకి సంబంధించిన విఎఫ్ ఎక్స్  పనులు విదేశీ హాంకాంగ్  కంపెనీకి అప్పగించినట్లు సమాచారం.

అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే శంకర్ సినిమాల్లో జాప్యం సాధరణమైన విషయం. షూటింగ్ పూర్తయిన నిర్మాణానంత పనులకు ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈక్రమంలో రిలీజ్ లు వాయిదా పడుతుంటాయి. ఈసినిమా సక్సెస్ తో తనపై వచ్చిన నెగిటివిటీని చేరుపుకోవాలని శంకర్ లో  కసి పట్టుదల కనిపిస్తుంది. ఈ సినిమా మధ్యలోనే అనివార్య కారణాలతో శంకర్  టాలీవుడ్కి  వచ్చి  చరణ్ సినిమా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.