మంచు విష్ణు స్టైలిష్ రేణుక ఇదుగో!

Wed Aug 10 2022 14:00:01 GMT+0530 (IST)

Here is Manchu Vishnu's stylish Renuka!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ 'జిన్నా'. ఈ మూవీ ద్వారా ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సన్నీ లియోన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అవ ఎంటర్ టైన్ మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై డా. ఎం. మోహన్ బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. టైటిల్ వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇటివల విడుదలైన మంచి విష్ణు సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో ఈమూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడట.

దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి ఈ మూవీకి కథ కోన వెంకట్ డైలాగ్స్ అందించారు. ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో ఈ మూవీని ఫన్ లాఫ్టర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో ఎలాగైనా సక్సెస్ ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్ లోకి రావాలన్న ఆలోచనలో వున్న హీరో మంచు విష్ణు ఈ మూవీకి సంబందించిన ప్రతీ విషయంలోనే చాలా కేర్ తీసుకుంటున్నారట. ఇటివల బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో ఓ స్పెషల్ సాంగ్ ని కంపోజ్ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ఇటీవల వైరల్ అయ్యాయి.  

అంతే కాకుండా ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరున్న ప్రభుదేవా కూడా ఓ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేయడం తెలిసిందే. ఇక టాలీవుడ్ క్రేజీ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా ఓ పాటకు కొరియోగ్రఫీని అందించడంతో 'జిన్నా' మూవీ హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా వుంటే ఈ మూవీలో నటించిన హీరోయిన్ ల క్యారెక్టర్ లని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ లని మేకర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం సన్నీ లియోన్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు.

ఇందులో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావుగా నటిస్తుండగా సన్నీ లియోన్ రేణుకగా స్టైలిష్ పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. పాయల్ రాజ్ పుత్ స్వాతి పాత్రలో నటిస్తోంది. పింక్ కలర్ షార్ట్..లైట్ టాప్ ఆ పై వైట్ బ్లేజర్ కళ్లకు గాగుల్స్ ధరించి హై హీల్స్ తో స్టైలిష్ గా అల్ట్రా గ్లామర్ లుక్ లో సన్నీ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.